- గెలిచి ఓడినోళ్ళు మళ్లీ గెలవరనే బీఆర్‌ఎస్ నాయకుల నోటికి
కళ్లెం వేసిన గడ్డం ప్రసాద్ కుమార్ - వికారాబాద్ గడ్డపై పైచేయి సాధించి కాంగ్రెస్ జెండా ఎగుర వేశారు
- ప్రజల మొగ్గు ప్రసాద్ కుమార్ వైపే నని విశ్లేషణాత్మక కథనాలను
వెలువరించిన ‘‘ఆదాబ్ హైదరాబాద్’’ దినపత్రిక - వికారాబాద్ జిల్లాలో నాలుగు స్థానాలను కైవసం చేసుకున్న హస్తం పార్టీ
- నా గెలుపుకు కృషిచేసిన కాంగ్రెస్ కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు
ఎల్లప్పుడూ రుణపడి ఉంటా : ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా (ఆదాబ్ హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా మెజారిటీ స్థానాలను చేసుకొని నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఆదివారం రోజున జరిగిన కౌంటింగ్ లో వికారాబాద్ జిల్లాలో నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. అందులో వికారాబాద్ నియోజకవర్గ గడ్డపై మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ భారీ మెజారిటీతో గెలుపొందారు. గెలిచి ఓడినోళ్లు మళ్లీ గెలవరని వాదించిన బిఆర్‌ఎస్ నాయకుల నోటికి కళ్లెం వేస్తూ హస్తం పార్టీ సత్తా చాటారు. ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనంద్ పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత ఒక ఎత్తైతే,గతంలో బిఆర్‌ఎస్ లో క్రియాశీలక పాత్ర పోషించిన ముఖ్య నాయకులు డాక్టర్ మెతుకు ఆనంద్ వైఖరి నచ్చక ఒక్కొక్కరిగా పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరి ఆనంద్ కు తగిన గుణపాఠం చెబుతూ గడ్డం ప్రసాద్ కుమార్ గెలుపే లక్ష్యంగా సైన్యంలా ముందుకు కదిలి వికారాబాద్ గడ్డ కాంగ్రెస్ గడ్డ అని నిరూపిస్తూ విజయకేతనం ఎగురవేశారు. అనందును గెలిపించేందుకు వచ్చిన ఎంపి గడ్డం రంజిత్ రెడ్డి చేసిన కృషి విఫలం అయింది.ముఖ్యంగా వికారాబాద్ లో బిఆర్‌ఎస్ కు ఇంతలా ఓట్లు పొలయ్యాయంటే కారణం రంజిత్ రెడ్డి.అంతేగానీ మెతుకు ఆనంద్ కు ఉన్న సొంత ఇమేజ్ ఇందులో ఏ మాత్రం లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఇకపోతే రెండు దఫాలు వికారాబాద్ ప్రజలు ఓడిరచినా తన జీవితం ప్రజా సేవకే అంకితం అని భావించిన గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్ ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలపై పోరాడి వికారాబాద్ ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకొని ఎమ్మెల్యేగా గెలుపొందారు.
‘‘ప్రజల మొగ్గు ప్రసాద్ కుమార్ వైపే’’ నని వెలువరించిన
ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక….
ప్రజల మొగ్గు ప్రసాద్ కుమార్ వైపే నని గతంలో ఆదాబ్ హైద రాబాద్ దినపత్రిక విశ్లేషణాత్మక కథనాలను వెలువరించింది. పలువురు ముఖ్య నాయకులు బిఆర్‌ఎస్ పార్టీని వీడనున్నారని కథనాలతో దూసుకెళ్లి కథనాలను, వికారాబాద్‌లో జరుగుతున్న రాజకీయ సమీకరణలపై కథనాలను ప్రచురించింది. ఊహించిన విధంగానే వికారాబాద్ గడ్డపై కాంగ్రెస్ పార్టీ విజయ కేతనం ఎగురవేసింది.ఈ సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొని ఎమ్మెల్యేగా గెలు పొందిన గడ్డం ప్రసాద్‌కుమార్‌తో విజయోత్సవ ర్యాలీనిర్వ హిం చారు. ఏగల్లీలో చూసినాబాణాసంచాలతో మార్మోగింది. వికారా బాద్ పూర్తిగా కాంగ్రెస్‌జెండాలతో హస్తమయంగా మారింది.