Monday, April 29, 2024

హ్యాట్రిక్‌ విజయం సాధించిన మాధవరం కృష్ణారావు

తప్పక చదవండి

కూకట్‌పల్లి : అనుకున్నట్లుగా కూకట్‌పల్లి కింగ్‌ మాధవరం కృష్ణారావు వరుసగా మూడవసారి కూకట్‌పల్లి ఎమ్మెల్యే గా విజయం సాధించి హ్యాట్రిక్‌ నమోదు చేసారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో వుండటం, ప్రభుత్వ పధకాలను అవసరమైన వారికి అందజేయడంలో కృష్ణారావు చేసిన కృషి ఆయన వరుస విజయాలకు బాటలు పరిచింది. దీంతో పాటు తలలో నాలుకలా మెలిగే నమ్మకమైన సిబ్బంది కృష్ణారావు గెలుపుకు తమ వంతు కృషితో అండగా నిలబడ్డారు. రాష్ట్రంలో ఎన్నికల నగారా మ్రోగింది మొదలు నియోజకవర్గంలోని ప్రతీ డివిజన్‌లో పాదయాత్ర ద్వారా ప్రజల్ని కలసి సంక్షేమ పధకాలు లబ్ధిదారులకు సక్రమంగా అందా యా లేదో తెలుసుకోవడం, అందని వారికి ఆయా పధకాలను త్వరితగతిన అందజేయడం, మౌలిక వసతుల కల్పన, మంచినీరు, మురుగునీటి సమస్యలు లేకుండా చూడటంలో అవిరళ కృషి చేశారు. ముఖ్యంగా మే నెల మొదటి వారం నుండి ప్రచారం ముగింపు రోజైన నవంబర్‌ 28 వరకూ ప్రతీ రోజూ నియోజకవర్గం ప్రజలతో మమేకమయ్యారు. కొన్నిసార్లు వాతావరణ అననుకూ లతలను కూడా విస్మరించి మాధవరం కృష్ణారావు గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు. రాష్ట్రమంతా కాంగ్రెస్‌ గాలిఊపేసినా, జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ తమ అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్‌ కుమార్‌ విజయం కోసం నియోజకవర్గంలో రోడ్‌ షో లతో హల్‌ చల్‌ చేసినప్పటికీ నియో జకవర్గం ప్రజలకు మాధవరం కృష్ణారావుపై ఆదరణ తగ్గిపోవడం విశేషం. ఇదంతా ఒక ఎత్తైతే నియోజక వర్గం కో-ఆర్డినేటర్‌ సతీష్‌ అరోరా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు కుడి ఎడమలు అన్నీతానే అయ్యిహ్యాట్రిక్‌ సాధనలో అలుపెరుగని కృషి చేశారు. ఈ అద్భుత విజయాన్ని స్వంతం చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తనపై అపారమైన నమ్మకం వుంచిన నియోజక వర్గం ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా తన విజయంలో ప్రధానంగా పనిచేసిన పార్టీ కార్యకర్తలకు అభిమానులకు మహిళా సోదరీమణులకు కార్పోరేటర్లకు ధన్యవాదాలు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు