- పట్టుకున్న బియ్యం ములుగుతున్న వైనం
- 120 బస్తాల బియ్యాన్ని గోడౌన్‌కు తరలించని అధికారులు
- సివిల్‌సప్లై అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
- ఉన్నతాదికారులు ఇటు చూడండి
కొత్తగూడెం : సివిల్ సప్లై అధికారుల నిర్లక్ష్యానికి పేదల బియ్యం పందికొక్కుల పాలు అవుతుంది. అడుగడుగునా అధికారుల అలసత్వానికి పట్టుబడిన బియ్యం కుళ్లి దుర్వాసనను వెదజల్లుతున్నాయి. అది చూసిన ప్రజలు అధికారుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోవాల్సిన ఉన్నతాధి కారులు ఇటుకేసి కన్నెత్తి చూడకపోవడంతో పేదప్రజలకు చేరాల్సిన రేషన్ బియ్యం వృధాగా పడి పనికి రాకుండా పోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపాల్టీలోని రామవరంలో గత ఏడాదిన్నర క్రితం20నెంబర్ రేషన్‌షానుకు అధికారుల నిర్లక్ష్యం వల్ల అదనంగా 120బస్తాల రేషన్ బియ్యాన్ని పంపించారు.ఆవిషయం బయటికి పొక్కడంతో సివిల్‌సప్లైఅధికారులు దాడులు నిర్వహించి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.ఆషాపును సీజ్ చేయడంతోపాటు డీలర్‌ను సస్పెండ్ సైతం చేశారు.
పట్టుబడిన బియ్యాన్ని లక్ష్మీదేవిపల్లి మండలంలోని ఎంఎల్‌ఎస్ పాయింట్ గోడౌన్‌కుతరలించాల్సి ఉన్నప్పటికి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆబియ్యాన్ని వదిలేశారు. ఇప్పటి వరకు ఆబియ్యం వైపు అధికారులు చూసిన దాఖలాలు లేవు. దీంతో ఆబియ్యాన్ని పందికొక్కులకు పలహారంగా మారాయి. అంతేకాకుండా ఆబియ్యం తడిసి దుర్వాసనను వెదజల్లు తున్నా యి.120బస్తాల బియ్యాన్ని ఇలా వదిలివే యడంపై ప్రజలు సివిల్ సప్లై అధికా రుల తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తు న్నారు. ఉన్నతా ధికారులు సైతం ఈవ్యవ హారంపై దృష్టి సారించ కపోవడం తో బియ్యాన్ని గోడౌన్‌కు తరలించక పోవడంతో సంబంధిత ఒక డీలరు అవసరం ఉన్నప్పుడు ఇలా ఆటోను తీసుకువచ్చి బియ్యాన్ని తరలిస్తున్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్‌షాపులతో పాటు ఇతర ప్రదేశాలలో పట్టుబడిన బియ్యాన్నివెంటనే కేసు నమోదు చేయడంతోపాటు ఆబియ్యాన్ని గోడౌన్‌కుతరలించాల్సి ఉంది. కాని ఇప్పటి వరకు ఈబియ్యాన్ని తరలించకపోవడం వెనుక మతలబేంటాని ఎవరికీ అర్థంకాని పరిస్థితి. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఈవిషయంపై విచారణ జరిపించాలని, రేషన్‌బియ్యం పాడవడానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.