Wednesday, May 1, 2024

ప్రైవేట్‌ ఉపాధ్యాయులా…బానిసలా..?!

తప్పక చదవండి
  • ప్రాణాలు తీస్తున్న బోధనేతర భారం
  • ఇంటికొచ్చిన తీరిక ఇవ్వని వర్క్‌ లోడ్‌
  • కుటుంబాలతో గడపలేని దుస్థితి
  • చిన్న లోపమున్న చీవాట్లు
  • ఒక్క సెకండ్‌ లేట్‌ అయిన గేటు బయటే
  • ఫలితంగా ధైర్యం కోల్పోతున్న ప్రైవేట్‌ టీచర్లు
  • వారిలో పెరిగిపోతున్న హృద్రోగ సమస్యలు
  • టీచర్‌కు టార్చర్‌…

నిజామాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): టీచర్‌ అంటే ఏం పని ఉంటుంది సరదాగా వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్స్‌ పని భారం అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రైవేట్‌ టీచర్‌ అంటే ఇన్ని డ్యూటీలు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. జైళ్లను తలపిస్తున్న ప్రైవేట్‌ పాఠశా లలు నాలుగు రోజుల్లోనే నలుగురు ఉపాధ్యాయులు మృత్యువాత పడ్డారు. అధిక పని భారం ఒకరోజులో ఉదయం 8.15.నుంచి, రాత్రి 7.వరకు, విద్య పై దృష్టి సారించాల్సిన అధికారులు, ప్రైవేట్‌ ఉపాధ్యా యులకు అధిక భారం మోపడం ఎలా అని అలోచించి ఎక్కవ డ్యూటీలు వేసి , తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ విద్యా విషయంలో తీసుకుంటున్న నిర్ణయాల వలన ఉపాధ్యాయులకు అధిక భారం శ్రమతో కూడిన పని వలన, మానసికంగా క్రుంగి పోతూ కుటుంబాలకు దూరం అవుతున్నారు. ఈ పాపం ఊరికే పోదని, అధికారులు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ప్రైవేట్‌ టీచర్స్‌ అన్నారు. లక్షల రూపాయల జీతాలు తీసుకొని నాలుగు గంటలు కూడా సరిగ్గా డ్యూటీ చేయాని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు మాత్రం 13గంటల సమయాన్ని ఉంచడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఠీవీగా బోధించిన రోజులు పోయి, టీ.వీ.లో బోధించవల్సిన రోజులు వచ్చాయి. కొంతకాలానికి గురువు కూడా తెరమరుగు అవుతాడేమో అని భయపడుతున్నారు. అధిక పని భారం వలన ఎందరో ప్రైవేట్‌ ఉపాధ్యాయులు ప్రాణాలు గాలిలో పోతున్నాయి. కరోనా టైం లో ఉద్యోగాలను సైతం వదిలేసారు. నిద్రలో కూడా స్కూల్‌ గురించి అలోచించి మృత్యువాత పడుతున్నారు. అయినా ప్రభుత్వనికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు బోధన తప్ప వేరె పనులు ఇవ్వ వద్దని కోరుతున్నారు.సెల్‌ ఫోన్లు మానేజ్మెంట్‌ తీసుకుంటున్నారు. ఎవరైనా చనిపోయిన సమాచారం ఇవ్వడం లేదు. రెండు లేట్‌ మార్క్‌ లకు ఒక సి.ఎల్‌ కట్‌ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఆదివారం పదవ తరగతి క్లాస్‌లు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా విద్యాశాఖాధికారి వెంటనే స్పందించి ప్రైవేట్‌ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇంత పని చేసిన జీతాలు సమయానికి ఇవ్వడం లేదని అన్నారు. యూనివర్సిటీ లో చదివి బానిస ల్లాగా బతుకుతున్నామని కన్నీటి పర్యంత మయ్యారు. జిల్లా కలెక్టర్‌ తక్షణమే చర్య తీసుకోవాలని కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు