Sunday, May 19, 2024

నర్సంపేట నియోజకవర్గ ప్రజల తీర్పు గౌరవిస్తున్న..

తప్పక చదవండి
  • నా పని విధానంలో మార్పులు చేసుకోవాలని గమనించా, స్టే ఆర్డర్లతో అభివృద్ధిని ఆపకండి నర్సంపేట
    మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి..

నర్సంపేట (ఆదాబ్‌ హైదరాబాద్‌): ఉద్యమ సమయంలో కూడా ఓడిపాయాను, నర్సంపేట నియోజకవర్గ పరిధిలో అన్ని రకాల నిధులు తెచ్చా, వందల సంఖ్యలో నాయకత్వం, వేల సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు, టెక్నికల్‌ గా అవకాశం ఇవ్వకపోయిన ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటానని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం నర్సంపేట కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు అవసరం లేదా,ఐదెండ్లకోసారి వచ్చే నాయకుడిని ప్రజలు కోరుకున్నారా చర్చ జరగాలి.. ప్రజలు నన్ను మరవచ్చు కాని నేను ప్రజలను మరవను.. నన్ను దెబ్బకొట్టచాడాని ఇద్దరుఒక్కటయ్యారు. పార్టీ కోసం ఎన్నో పదవులను వదులుకున్నాను, నియోజకవర్గ పరిధిలో విజన్‌ తో ముందుకు వెళ్లే అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా పధకాలు తెచ్చాను.. పాకాల, రంగాయ చెరువు కింద కాలువలు పూర్తి చేయాల్సిన పనులు చాలా పెండిరగ్‌ లో ఉన్నాయి, ఇప్పుడు గెలిచిన నాయకులు అవి పూర్తి చేయాలని కోరుతున్నా అని అధికార పార్టీ ఎమ్మెల్యేకు సూచించారు. నర్సంపేట నియోజకవర్గంలో 69 సెంటర్లలో పల్లె దవాఖానలు తెచ్చిన. పెండిరగ్‌లో ఉన్న పనులు సకాలంలో పూర్తి చేయాలని కొత్త ప్రభుత్వం ను కోరుతున్న.. 20 సంవత్సరాలుగా పెండిరగ్‌లో ఉన్న బ్రిడ్జిలుపోరాడి తెచ్చి ఇటివల శంకుస్థాపన చేసుకున్నాము వాటిని కూడా పూర్తి చేయాలని కోరుతున్నా అన్నారు. ప్రభుత్వ అవసరాలకు స్థలాన్ని గుర్తించాం, టెండర్లు పిలిచిన వాటిని పూర్తి స్థాయిలో నిర్మాణపనులు చేయాలి.. ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాష్ట్ర స్థాయి గుర్తింపు తెచ్చాను. రైతులకు, ప్రజలకు ఆపదలో, తుపాను సమయంలో కూడా అందుబాటులో ఉన్న నాకు ప్రజలు ఈ స్థాయిలో తీర్పు ఇస్తారని ఊహించలేదు. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా రైతులకు పంట నష్టపరిహారం ముఖ్యమంత్రితో కొట్లాడి తెచ్చిన బిడ్డను.మహిళలకు, యువకులకు ఉపాధి కోసం ట్రైనింగ్‌ క్యాంపు లు ఏర్పాటు చేశా.. ఎన్నో పైలట్‌ ప్రాజెక్ట్‌ లు తెచ్చిన ఘనత కూడా నాదే అని స్పష్టం చేశారు.నాకు రాజకీయలు రావు, ఉద్యమ నేపథ్యంలో వచ్చిన కాబట్టి నాకు కుట్రలు రావు కాబట్టే ప్రజలు నాకు ఈ తీర్పు ఇచ్చారని అనుకుంటా అయినా పాజిటివ్‌ గా తీసుకుంటా అని పేర్కొన్నారు.ఎన్నో రకాలుగా డివిజన్‌ ను అభివృద్ధి చేద్దామని డిజైన్‌ లు తయారుచేసి పెట్టుకున్న, కాని ప్రజల తీర్పు వల్ల ఏమి చేయలేని పరిస్థితి.నర్సంపేటను వదిలిపెట్టి నేను ఎప్పుడూ బయట ఉన్నది లేదు, ఎప్పుడు ప్రజలకు సేవ చేయడమే నాకు తెలుసు. నియోజకవర్గంలో ఏ ఒక్క పనైన పెండిరగ్‌లో ఉందా, దాదాపు అన్ని పనులు పూర్తి చేయాలని ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తెచ్చిన ప్రజలు గమనించాలి.. ఎమ్మెల్యే అంటే ఒక బాధ్యతగా ప్రజల కోసం, కార్యకర్తల కోసం పనిచేశాను.. హర్టికల్చర్‌ యునిట్‌ కోసం ఫారెస్ట్‌ అధికారులతో కేసులపాలయ్యాను అయిన తగ్గకుండా నల్లబెల్లి మండలం కన్నారావుపేటలో రైతులతో మాట్లాడి భూమి సేకరించి హర్టికల్చర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ శంకుస్థాపన చేసుకున్నాము.పెద్ది సుదర్శన్‌ రెడ్డి తెచ్చిన పనులు నేనేందుకు చేయాలని ఇప్పుడు గెలిచిన నాయకులు బావించకుండా ప్రజలకోసమైన పనులు పూర్తి చేయాలని కోరుతున్నా అన్నారు.. నర్సంపేటలో వందల కోట్ల నిధులు మంజూరు చేసి ఉన్నాయి వాటిని ల్యాప్స్‌ చేయకండి.. ప్యారాలాల్‌ డ్రైనేజీ కోసం 4కోట్ల నిధులు మంజూరు అయింది, అది కూడా పూర్తి చేయాల్సిన అవసరంఉంది.. నియోజకవర్గ అభివృద్ధి కోసం నా సంపూర్ణ సహకారం ఎప్పుడూ ఉంటుందని ప్రస్తుత ఎమ్మెల్యే గమనించాలని కోరారు. కోర్టులో స్టైల్‌ తెచ్చి నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకోకుండా స్టే లు విత్‌ డ్రా చేసుకుని నర్సంపేట అభివృద్ధికి ఛాయాచక్తుల కృషి చేయాలని నర్సంపేట అభివృద్ధిలో నా సలహాలు సూచనలు ఎల్లప్పుడు అధికార పార్టీకి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు