Monday, April 29, 2024

మల్లాపూర్ లో “పెట్రోల్ దొంగలు”..

తప్పక చదవండి
  • ఐఓసీ, బిపిసిఎల్ పెట్రోల్ ట్యాంకర్ల యజమానులే దొంగలు….
  • ప్రమాదాలు జరిగితే కాలనీ కాలనీలే బుగ్గిపాలు….
  • ఎస్ఓటి పోలీసుల రైడ్ లో కీలక విషయాలు….
  • స్థానిక పోలీసుల సహకారంతోనే ఇదంతా….

నాచారం : తెలంగాణ రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్, గ్యాస్ కేంద్రాలకు మల్లాపూర్, చర్లపల్లి కేంద్ర బిందువుగా నిలుస్తుంది. ఇక్కడ బిపిసిఎల్, హెచ్ పిసి ఎల్ గ్యాస్, పెట్రోల్, డిజిల్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేసి ఫుల్ లెవెల్ ట్యాంకుల కేంద్రాలు నెలకొల్పి ఉన్నాయి. బీపీసీఎల్, హెచ్ పి సిఎల్ పెట్రోల్ తరలించేందుకు ఆయా సంస్థలు వందలాది పెట్రోల్ ట్యాంకర్లను కాంట్రాక్ట్ పద్ధతిన ఏర్పాటు చేసుకుంటారు. దీన్నే అదునుగా భావించిన ట్యాంకర్ల యజమానులు కొంతమంది బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని ఫిలిం కేంద్రాల నుంచి బయటకు రాగానే కొన్ని బ్యారెకుల కొద్దీ పెట్రోల్, డీజిల్ దొంగలిస్తుంటారు. కంపెనీ నిబంధన ప్రకారం ఫిల్లింగ్ స్టేషన్ లో పెట్రోల్, డీజిల్, హీత నాయిల్, జెట్ పెట్రోల్ ట్యాంకర్ల నుండి పైపు లేసి లీటర్ల కొద్ది దొంగలిస్తుంటారు.

ట్యాంకర్ల యజమానులే దొంగలు :
పెట్రోల్, డీజిల్ ఫిల్లింగ్ కేంద్రాల నుండి ట్యాంకర్లు బయటకు రాగానే కనక దుర్గా కాలనీ, గోకుల్ నగర్, మై విల్లాస్ వెనకాల డెన్నులు ఏర్పాటు చేసుకొని పెట్రోల్ దొంగతనాలకు పాల్పడతారు. పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల యజమానులకు స్థానిక పోలీసుల సహాయ సహకారాలతోనే ఇదంతా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

- Advertisement -

ఎస్ఓటి పోలీసుల రైడ్ లో కీలక విషయాలు :
నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్ పెట్రోల్, డీజిల్ దొంగలను పట్టుకోవడంలో ఎస్ఓటి పోలీసుల కీలకపాత్ర. ఇదంతా జరుగుతుంటే స్థానిక పోలీసులు సహాయ సహకారాలు అందిస్తున్నారని అనుమానాలు లేకపోలేదు.

పెట్రోల్ తీస్తుండగా పేలిన ట్యాంకర్ :
గతంలో చెంగిచెర్లలో అడ్డాగా చేసుకొని పెట్రోల్ తీస్తుండగా ప్రమాదవశాత్తు పేలిపోయి నలుగురు దుర్మరణం పాలైన సంఘటనలు ఉన్నాయి.
మల్లాపూర్ గోకులంలో నిత్యం వందలాది పెట్రోల్ ట్యాంకర్లు ద్వారా పెట్రోల్ తీస్తుంటే ఏ ప్రమాదం ఎప్పుడు జరుగుతుందో నాని ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారు.ఎన్నోసార్లు పోలీసులకు పట్టించుకోవడం లేదని కేవలం ఎస్ఓటి పోలీసులకే పట్టుబడునులోనే అంతర్యం దాగి ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు