Monday, May 13, 2024

ఎన్నికల సమయానికే ప్రజలు గుర్తుకొస్తారు

తప్పక చదవండి
  • బీజేపీ, కాంగ్రెస్‌కు అభివృద్ధి అంటే నిర్వచనం కూడా తెలియదు
  • బీజేపీి, కాంగ్రెస్‌కు ఓట్లు వేసే పరిస్థితిలో తెలంగాణ సమాజం లేదు
  • సీఎం కెసిఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ దూసుకెళ్తోంది : కల్వకుంట్ల కవిత]

నిజామాబాద్‌ :బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులకు అభివృద్ధి అంటే కనీసం నిర్వచనం కూడా తెలియని, కాంగ్రెస్‌, బీజేపీల నేతలకు ఎన్నికల టైమ్‌లో వచ్చి ఓట్ల కోసం మాయమాటలు చెప్పడం అలవాటుగా మారిం దని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శిం చారు. తెలంగాణ ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యం కలిగి ఉన్నారని, కల్లబొల్లి మాటలు నమ్మి ఓట్లేసే పరిస్థితిలో తెలంగాణ సమాజం లేదని ఆమె చెప్పారు. బుధవారం ఉదయం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పర్యటనలో కవిత మాట్లాడారు. రాహుల్‌ గాంధీ ఇప్పుడు బీసీ జనగణన గురించి మాట్లాడుతున్నారని, కానీ సంక్షేమంలో బీసీలకు పెద్దపీట వేసిందే కేసీఆర్‌ అనే సంగతి గుర్తంచుకోవాలని కవిత హితవుపలికారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ప్రభుత్వం చెరుకు రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నదని, రైతులను కళ్లల్లో పెట్టుకుని కాపాడుకునే నైజం కేసీఆర్‌ది అయితే, ఆ రైతులపై రాజకీయాలు చేసే నైజం రాహుల్‌గాంధీది అని కవిత విమర్శించారు. ఎన్నికలప్పుడే వచ్చి మాయ మాటలు చెప్పే వాళ్లను నమ్మాలో లేదంటే ఎల్లప్పుడూ వెంట ఉండి పనిచేసే వాళ్లను నమ్మాలో ప్రజలే ఆలోచించుకోవాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. ముఖ్యమంత్రిని మార్చాలనుకున్నప్పుడల్లా మత కల్లోలాలు రెచ్చగొట్టిన పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని విమర్శించారు. ఇప్పుడు హిందూ ముస్లింలు కలిసిమెలిసి మత సామరస్యంతో పండుగలు చేసుకుంటున్నారని చెప్పారు. 65 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడి ప్రజలకు మంచి నీళ్లుగానీ, సాగు నీళ్లుగానీ, మంచి విద్యగానీ, మంచి వైద్యంగానీ ఎందుకు ఇవ్వలేకపోయిందో రాహుల్‌గాంధీ చెప్పాలని కవిత డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో 2014కు ముం దు ఒక్కటే బీసీ హాస్టల్‌ ఉండేదని, ఇప్పుడు కేసీఆర్‌ పాల నలో బీసీ హాస్టల్‌ల సంఖ్య 15కు పెరిగిందని కవిత చెప్పారు. బీసీ బిడ్డలను విదేశాలకు పంపి చదివిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్‌ ప్రభుత్వమని, ఇది బీసీ సాధికారత అవునో కాదో..? రాహుల్‌గాంధీయే చెప్పాలని కవిత డిమాండ్‌ చేశారు. నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని చంద్రబాబు ప్రైవేటు పరం చేసినప్పుడు ఇక్కడి కాంగ్రెస్‌ నేతలు ఎందుకు నోరు మెద పలేదో రాహుల్‌గాంధీ చెప్పాలన్నారు. పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని మోదీ తెలంగాణపై అక్కసు వెళ్లగక్కుతుంటే రాహుల్‌గాంధీగానీ, సోనియాగాంధీగానీ ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆమె ప్రశ్నించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు