- అభివృద్ధికి ఇద్దరు మంత్రులు కృషి చేయాలి
- మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
మిర్యాలగూడ : ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని దీనికి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనేక అభివృద్ధి పనులు పెండిరగ్లో ఉన్నాయని ఇందులో ప్రధానంగా ప్రాజెక్టులు అసంపూర్తిగా నిలిచిపోయారు ముఖ్యంగా ఎస్‌ఎల్బీసీ టెన్నల్ పనులు, ఎడమ కాలు పరిధిలోని లిఫ్టుల నిర్వహణ, మరమ్మత్తులు, వరద కాలువ రిపేర్లు వెంటనే పూర్తి చేయాలన్నారు. దీనికోసం ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని కోరారు. పట్టణాల్లో నిలిచిపోయిన అంతర్గత డ్రైనేజీ పనులను వెంటనే పూర్తి చేయాలని కోరారు. పెండిరగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిన వెంటనే చేపట్టాలని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. విద్యా, వైద్యం, రోడ్లు, ఉద్యోగ అవకాశాలు, కరెంట్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ కోసం లబ్ధిదారుల నుండి డీడీలు రూపంలో నగదును స్వీకరించిందని ఆ లబ్ధిదారులకు వెంటనే న్యాయం చేయాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నిటిని అంటే నామాలు చేయాలని హామీల అమల కోసం అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసి అన్ని పార్టీల అభిప్రాయాలను సేకరించాలని కోరారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా కమిటీ సభ్యులు నూకల జగదీష్ చంద్ర, మూడవత్ రవి నాయక్, డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, రాగిరెడ్డి మంగారెడ్డి, తిరుపతి రామ్మూర్తి, శశిధర్ రెడ్డి, వరలక్ష్మి, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.