శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండలం మియాపూర్ లోని సర్వే నెంబర్ 100,101లోని ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రభుత్వ భూమి కబ్జాపై ఆర్డీవో చర్యలు తీసుకోవాలని ఆదాబ్ లో ఆదివారం ప్రచురితమైన కథనంపై రెవెన్యూ అధికారులు స్పందించారు. ఈ మేరకు సోమవారం రాజేంద్ర నగర్ ఆర్డీవో ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి తహశీల్దార్ కార్యాలయ ఆర్‌ఐలు శీనయ్య,రాంబాబుల ఆధ్వర్యన రెవెన్యూ సిబ్బంది సర్వే నెంబర్ 100,101లోని అక్రమ కట్టడాలు,షెడ్డును తొలగించారు. ఈ సందర్భంగా ఆర్‌ఐలు శీనయ్య, రాంబాబులు మాట్లాడుతూ..ప్రభుత్వ భూములను ఎవరు ఆక్రమించాలని చూసినా..కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలా ఎవరూ కబ్జాలకు పాల్పడినా తమకు వెంటనే సమాచారం అందించాలని చెప్పారు. ప్రభుత్వ భూమి కబ్జా పేరుతో కథనం ప్రచురించిన ఆదాబ్ పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు..