Sunday, May 5, 2024

శంకర్‌ పల్లి మున్సిపల్‌లో భూ కబ్జాల పర్వం..

తప్పక చదవండి
  • తీగల వాగులో నుండి సిమెంట్‌ రోడ్డు..
  • తూ..తూ..మంత్రంగా అధికారుల చర్యలు..
  • పత్రికల్లో ప్రచురితం అయితేనే చర్యలు…?

శంకర్‌ పల్లి : ప్రభుత్వ భూమి కనిపిస్తే చాలు అక్రమార్కులు కబ్జా పెడుతున్నారు. చివరికి తీగల వాగును కూడా వదలి పెట్టకుండా కబ్జాకు పాల్పడుతున్నారు.రంగారెడ్డి జిల్లా శంకర్‌ పల్లి మున్సిపల్‌ పరిధిలో గల తీగల వాగు కబ్జా కోరల్లో చిక్కుకుంది.అధికారులు మాత్రం సమాచారం తెలిసినా పత్రికల్లో వార్త వచ్చేవరకు నిద్ర మత్తులో ఉంటున్నారు.తీరా పత్రికల్లో వార్త రాగానే కొంచం హడావుడి హంగామా చేసి చేతులు దులుపుకుంటున్నారు.
కబ్జా చేసిన వారితో అధికారులు కుమ్మక్కు అయ్యారా..?
అవును అనే అనుమానం రాక తప్పదు…అనుమానం రావటానికి కారణాలు కూడా లేకపోలేదు.. మున్సిపల్‌ లోని వివేకానంద కాలేజ్‌ వెనకాల గల వాగును చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది.తీగల వాగులో సింగపురం, శంకర్‌ పల్లి పలు కాలనీల నుంచి నీరు వస్తుంది.మామూలు సమయంలో నీరు సులభంగానే వెళ్తుంది,కానీ వర్షాకాలంలో మాత్రం నీరు చుట్టుపక్కల ఇళ్ళలోకి వస్తుంది.రోడ్డు నుంచి రైల్వే బ్రిడ్జి వరకు ఉన్న వాగును పూర్తిగా కుదించి వాగులో బ్రిడ్జి కింద నుండి ఓ వెంచర్‌ వాళ్ళు పైపులను వేసి దానిపై నుండి ఏకంగా సిమెంట్‌ రోడ్డునే వేసుకున్నారు. కానీ ఇంత పెద్ద వాగు నీరు ఆ చిన్న పైంపులోంచి వెళ్లలేని పరిస్థితి ఉంది.అధికారులకు ఈ విషయం తెలిసిన చర్యలు మాత్రం శూన్యం.ఇప్పటికైనా అధికారులు స్పందించి నాళాలు,వాగులు కబ్జా రాయుళ్ళ పర్వం కాకుండా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు