Wednesday, September 11, 2024
spot_img

మరోమారు గెలుపు నాదే: నోముల భగత్‌

తప్పక చదవండి

నాగార్జునసాగర్‌ : రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగులేదని బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్‌ అన్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో ఈసారి కూడా గెలుపు తనదేనని దీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ పాలనలోనే పేదల జీవితాల్లో వెలుగులు నిండాయని తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ ఫలం అందని ఇళ్లు లేదంటే అతిశయోక్తి కాదని అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు కావాలనే కొంత మందితో రోడ్‌రోలర్‌ గుర్తు వచ్చేలా నామినేషన్‌ వేయిస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా విజయం బీఆర్‌ఎస్‌దే అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు