Friday, May 3, 2024

జనసేన పార్టీ గుర్తుపై కొత్త సమస్య..

తప్పక చదవండి

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ప్రతి పార్టీ తమ గుర్తును ఓటర్లకు చూపించుకుంటూ ప్రచారంలో వేగం పెంచాయి. ఈ సారి గెలుపు తమదంటే తమదంటూ ఎలక్షన్ల బరిలో అభ్యర్థులు రకరకాల హామీలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సారి జనసేన పార్టీ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైంది. బీజేపీతో పొత్తులో భాగంగా కూకట్‌పల్లి నుంచి జనసేన తరఫున ప్రేమ్ కుమార్ బరిలో దిగనున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. బీజేపీతో కలిసి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ పార్టీ.. తెలంగాణలో మొత్తం 8 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. పలు స్థానాల్లో గెలుపుపై ధీమాగా ఉంది. వీటిలో సెటిలర్లు ఎక్కువగా ఉన్న కూకట్‌పల్లి స్థానం ఒకటి. పైగా ఇక్కడ జనసేన తరఫున పోటీ చేస్తున్న ప్రేమ్‌ కుమార్‌ కొన్నేళ్లుగా నియోజకవర్గంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తూ జనం మనసులు గెలుచుకుంటున్నారు. జనసేన ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కూకట్‌పల్లి స్థానంలో ఆ పార్టీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. అది కూడా.. ‘జాతీయ జన సేన పార్టీ’ రూపంలో..! జాతీయ జనసేన తరఫున ఇక్కడ అభ్యర్థి బరిలో ఉన్నారు. అంతేకాదు, జనసేన పార్టీ గుర్తు ‘గాజు గ్లాసు’ కాగా, జాతీయ జన సేన పార్టీ గుర్తు ‘బకెట్‌’. రెండు పార్టీల పేర్లు ఒకేలా ఉండటం, రెండు పార్టీల గుర్తులూ ఇంచుమించు ఒకేలా ఉండటం జనసేన పార్టీకి సమస్యగా మారింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు