ముంబై : మిస్ దివా యూనివర్స్ కిరీటం దక్కించుకున్న 23 ఏళ్ల మోడల్ శ్వేతా శారదా ఎల్ సాల్వడార్‌లో జరిగే మిస్ యూనివర్స్ పోటీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వ హించడానికి సిద్ధమవుతున్నారు. చండీగఢ్‌లో జన్మించిన శ్వేతా.. ఇటీవల ముంబైలో జరిగిన వేడుక ల్లో ప్రతిష్టాత్మక మిస్ దివా యూనివర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఈ పోటీలో 15 మంది ఇత ర పోటీదారులలో శ్వేత నిలవగా.. 2022 విజేత దివితా రాయ్ నుంచి ఆమె కిరీటాన్ని పొందారు. మి స్ దివా ఫెమినా మిస్ ఇండియా గ్రూప్‌లో భాగం. మిస్ యూనివర్స్ కోసం భారతదేశ ప్రతినిధుల ను ఎంచుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా నాలుగు ప్రధాన అంత ర్జాతీయ అందాల పోటీలలో ఒకటి. చండీగఢ్‌కు చెందిన శ్వేతా శారదా భారతీయ మోడల్. 16 సంవత్సరాల వయస్సులో శ్వేతా తన తల్లితో ముంబైకి మకాం మార్చుకున్నారు. ఫెమినా బ్యూటీ పాజెంట్స్ సమాచారం ప్రకారం, శ్వేతా.. ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీని అందుకున్నారు. ఆగస్టు 27, 2023న జరిగిన మిస్ దివా పోటీల 11వ ఎడిషన్‌లో విజయం సాధించిన శ్వేతా శారదా మిస్ దివా 2023 టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. ఆమె డాన్స్ ఇండియా డ్యాన్స్, డ్యాన్స్ దీవానే, డ్యాన్స్ ప్లస్‌తో సహా అనేక రియాలిటీ షోలలో కూడా కనిపించారు. ఆమె రaలక్ దిఖ్లా జాలో కొరియోగ్రాఫర్ కూడా. మిస్ యూనివర్స్ 2023 నవంబర్ 16న రాత్రి 9:00 గంటలకు షెడ్యూల్ అయింది.