150 పడకల ఆసుపత్రి, ఫైర్ స్టేషన్‌లకు భూమి పూజ…
- మార్కెట్ ఆఫీస్, కేజీబీవీ స్కూల్స్, గోదాములను ప్రారంభించనున్న మంత్రి…
మఖ్తల్ : మక్తల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిం చేందుకు బుధవారం వైద్య ఆరోగ్యశాఖ, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు రానున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఖానాపూర్ రోడ్ లోని పంప్ హౌస్ సమీపంలో 34 కోట్ల రూపాయలతో చేపట్టనున్న 150 పడకల ప్రభుత్వాసుపత్రి నిర్మాణానికి మంత్రి హరీష్ రావు భూమి పూజ చేయనుండగా… మిగతా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి హాజరుకాను న్నారు. దీంతోపాటు రాయచూరు రోడ్ లోని ఫైర్ స్టేషన్ నిర్మాణానికి సైతం భూమి పూజ చేయనున్నారు. 76 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన మక్తల్ వ్యవసాయ మార్కెట్ భవనాన్ని సైతం ప్రారంభించనున్నారు. పులిమామిడి, కృష్ణ లలో నూతనంగా నిర్మించిన కేజీబీవీ స్కూళ్లను ప్రారంభించనున్నారు. రైతుల కోసం నిర్మించిన గోదాములను సైతం అందుబాటులోకి తీసుకురానున్నారు. మినీ ట్యాంక్ బండ్ వద్ద వెల్కమ్ మక్తల్ బోర్డ్ సైతం స్థానిక ప్రజల కోసం ప్రారంభించనున్నారు. పెద్ద ఎత్తున మఖ్తల్ నియోజవర్గ కేంద్రంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి హరీష్ రావు రానుండటంతో… నియోజకవర్గం లోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి టిఆర్‌ఎస్ కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజర విజయవంతం చేయాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి, చిట్టెం సుచరితా రెడ్డి, మండలాధ్యక్షుడు మహిపాల్ రెడ్డి కోరారు.