Saturday, April 27, 2024

అందరు కలిశారు.. అన్యాయం చేశారు

తప్పక చదవండి
  • స్థానికులకు మొండి చేయి…
  • స్థానికేతరులకు పట్టాలు …
  • న్యాయం కోసం నిర్వాసితుల వేడుకోలు

కొత్తగూడెం : సింగరేణి కొత్త గూడెం ఏరియా లోని వికె సెవెన్‌ ఓపెన్‌కాస్ట్‌ భూ నిర్వాసితుల కుటుంబాలను గత ఆర్డీఓ, తహశీల్దార్‌ కొంతమంది నాయకులు కలిసి వీధిపాలు చేశారు. అసలు నిర్వాసితులు స్థానికులైతే స్థాని కతుల పేర్లను చేర్చి అర్హులను రోడ్డున పడేశారు. ఈపేర్ల చేర్పింపు విషయంలో పెద్దఎత్తున ముడుపులు చేతులు మారాయి అన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. వికె ఓసి తీసేందుకు ఈ ఓపెన్‌కాస్ట్‌ పరిసర ప్రాంతాలైన వనమా నగర్‌, మాయాబజార్‌, ఎస్‌ఆర్‌టి ఏరియాలను తొలగించాల్సి వచ్చింది. అయితే ఇక్కడ ఇండ్లు కట్టుకొని నివాసం ఉంటున్న వారికి స్థలం కేటాయింపు కోసం గత కొన్ని నెలలుగా ఏరియా అధికారులతోపాటు ప్రభుత్వఅధికారులు, నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఈక్రమంలోనే కార్పోరేట్‌ ఏరియా పరిధిలోని పాత మ్యాగ్జిన్‌ స్థలాన్ని నిర్వాసితులకు కేటాయించారు. భూనిర్వాసితులు గుర్తిం చిన వారికి మంగళవారం కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటే శ్వరరావు పట్టాలు పంపిణీ చేశారు. అయితే ఈని ర్వాతులను గుర్తించే క్రమంలో పెద్దఎత్తున అవినీతి అక్రమాలు చోటు చేసుకు న్నాయని పట్టాల పంపాణీ చూస్తే తెలుస్తుంది. స్థానికంగా నివాసం ఉంటూ అన్ని ఉన్నప్పటికీ వారిని నిర్వాసితుల లిస్టులో చేర్చకుండా పట్టాలు, స్థలం కేటాయించకుండా అన్యా యం చేశారు కొంతమంది ప్రబుద్ధులు. అసలు ఈ ఏరియాలకు సంబం ధం లేని వ్యక్తుల పేర్లు చేర్చి వారికి పట్టాలు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత అనేక సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉన్నా స్థలం కేటాయించకుండా, పట్టాలు ఇవ్వకుండా అన్యాయం చేయడంపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమ వుతుంది. స్థానికేతరుల పేర్లును చేర్చడంలో అధికారులతోపాటు కొంతమంది నాయకులహస్తం కూడా ఉందని ఆరోపిస్తున్నారు ప్రజలు. అంతేకాకుండా స్వయంగా ఎమ్మెల్యే పట్టాల పంపణీ వేదికపై నుంచే గత ఆర్డీఓ, తహశీల్దార్‌లు చేసిన తప్పిదమని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు అన్యాయం జరగకుడా చూస్తామని కమిటీని ఏర్పాటు చేసి అర్హులను గుర్తించి తిరిగి పట్టాలు అందచేస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితులు సైతం తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేను వేడుకున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు