Friday, May 10, 2024

మల్కాజిగిరిని దత్తత తీసుకుంటా…

తప్పక చదవండి
  • నెలకొకసారి వస్తా: మంత్రి హరీష్‌ రావు

మల్కాజిగిరి : మాజీ కార్పొరేటర్‌, బిజెపి నాయకులు జీకే. శ్రీదేవి హనుమంతరావు బుధవారం మంత్రి హరీష్‌ రావు సమక్షంలో బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వివరాల్లోకి వెళ్తే జీకే.హనుమంతరావు ఆధ్వర్యంలో మల్కాజిగిరి నియోజకవర్గం నేరేడ్మెట్‌ డివిజన్‌ పరిధిలోని జీకే సరస్వతి ఫంక్షన్‌ హాల్‌లో బిఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య నాయకుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి హరీష్‌ రావు, మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌ రెడ్డిలు హాజరయ్యారు. సుమారు 300 మంది బిజెపి పార్టీని విడి, జీకే హనుమంతరావుతో కలిసి మంత్రి హరీష్‌ రావు సమక్షంలో బిఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రులు హరీష్‌ రావు, మల్లారెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మల్కాజిగిరి ప్రజలు మైనంపల్లి నుండి విముక్తి కోరుకుంటున్నారని, మల్కాజిగిరిలో అధికారంలోకి వచ్చేది బిఆర్‌ఎస్‌ పార్టీ నేనని మంత్రి హరీష్‌ రావు జోష్యం చెప్పారు. బిఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక హైదరాబాదులో త్రాగునీటి, కరెంటు సమస్యలు లేవని, కర్పూలు బందులు లాంటివి లేకుండా హైదరాబాద్‌ సురక్షితంగా ఉందని అన్నారు.రాబోయే ఎలక్షన్స్లోబిఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అదేవిధంగా మల్కాజిగిరి నియోజక వర్గాన్ని తాను దత్తత తీసుకుంటున్నానని నెలకొకసారి మల్కాజిగిరికి వచ్చి జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షిస్తానని హరీష్‌ రావు అన్నారు.బిఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి మరి రాజశేఖర్‌ రెడ్డి మాట్లా డుతూ… మల్కాజిగిరి ప్రజలు తనకు అవకాశం ఇస్తే మల్కాజిగిరి నియోజకవర్గాన్ని మోడల్‌ మల్కా జిగిరిగా తీర్చు దిద్దుతానని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు మీనా ఉపేందర్‌, శాంతి శ్రీనివాస్‌ రెడ్డి, మురుగేష్‌, మల్కాజిగిరి ఎలక్షన్ల ఇన్చార్జ్‌ ఆర్. జితేందర్‌ రెడ్డి, జేఏసీ వెంకన్న, అమీరుద్దీన్‌, చికెన్‌ షాప్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజు తో పాటు సీనియర్‌ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు