Thursday, July 25, 2024

ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం

తప్పక చదవండి
  • కొత్త ప్రభుత్వానికి అందరూ సహకరించాలి
  • కమిట్‌మెంట్‌తో ఇచ్చిన హామీలు అమలు చేయండి
  • ఇవాళ సభలో సభ్యుల చర్చ ఆరోగ్యకరంగా ఉంది..
  • ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

హైదరాబాద్‌ : ‘ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగం. ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో చూస్తాం,’అని అనడం మంచిది కాదని, కొత్త ప్రభుత్వానికి అందరూ సహకరించాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. పాత ప్రభుత్వం ఎందుకు విఫలమైందో కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిశీలన చేసి పని చేయాల్సి ఉంటుందన్నారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కూనంనేని మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. పాత ప్రభుత్వం ఎందుకు విఫలమైందో కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిశీలన చేసి పని చేయాల్సి ఉంటుందని సూచించారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా కూనంనేని పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 2020లో 17 రోజులు, 2023లో 11 రోజులు మాత్రమే సభ నడిచిందన్న ఆయన ఈ దఫా అసెంబ్లీని ఎక్కువ రోజులు నిర్వహించేలా చూడాలని సభను కోరారు. నిర్మాణాత్మకంగా సభలో సభ్యులు మాట్లాడాలని, వాటిలోనూ సభ్యుల మాటలు ఆరోగ్యదాయకంగా ఉండాలని కూనంనేని ఆశించారు. వ్యక్తిగత దూషణకు వెళ్లకుండా సభను పక్కదారి పట్టించకుండా మాట్లాడాలని కోరారు. అప్పుడే ప్రజా సమస్యలకు పెద్ద పీఠ వేయొచ్చని తన భావాన్ని వ్యక్తపరిచారు. దివంగత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఆనాడు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారని, జలయజ్ఞానికి నిధులు వాటంతట అవే సమకూరాయని తెలిపారు. హామీలు నెరవేర్చేందుకు డబ్బు ఇబ్బంది కాదని, కేంద్రం నుంచి రాష్ట్రానికి చాలా నిధులు రావాల్సి ఉందని’ అన్నారు. దశాబ్ద కాలంపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీ ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం వల్లే బీఆర్‌ఎస్‌ ఓటమి పాలయ్యిందని అన్నారు. ఉద్యమ పార్టీగా వచ్చిన భారత రాష్ట్ర సమితి ప్రజా స్వేచ్ఛను హరించందని కూనంనేని విమర్శించారు. భవిష్యత్తు కూడా ఇలాగే ఉండాలన్నారు. సభలో వ్యక్తిగత దూషణలు ఉండకుండా చూడాలి.. మార్షల్‌ కి పని చెప్పకుండా పని చేద్దామని కూనంనేని తెలిపారు. ఎంఐఎం, బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఒక్కటే అనే భావన కలిగేలా కేటీఆర్‌ మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. ఇది మంచిది కాదు అని తన ఉద్దేశమన్నారు. తక్కువ రోజులు కాకుండా.. ఎక్కువ రోజులు సభ జరపండి.. ఆరు గ్యారంటీల అమలు చేయండని తెలిపారు. వైఎస్‌ చాలా హామీలు ఇచ్చి.. అమలు చేశారని కూనంనేని సాంబశివరావు తెలిపారు. మీరు కూడా అలాగే ఇచ్చిన హామీలు అమలు చేయండని పేర్కొన్నారు. కమిట్‌ మెంట్‌ తో ప్లానింగ్‌ ఇచ్చిన హామీలు అమలు చేయండని అన్నారు. లక్ష కోట్లతో ప్రాజెక్టు కడితే.. 10 వేల కోట్లే ఉపయోగంలోకి వస్తున్నాయని తెలిపారు. మిగిలినవి ఎటు వెళ్తున్నాయో అర్థం కాలేదు.. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అలా కాకుండా చూడాలని తెలిపారు. మీ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదు అంటున్నారు.. ఇది మంచి పద్ధతి కాదు.. మళ్ళీ కొనడం మొదలు పెడతారా అని ప్రశ్నించారు. ఇలాంటి అతి ఉత్సాహం మాటలుపనికి రాదని అన్నారు. ప్రజల ఆలోచన పక్కదారి పెట్టె అంశం గత పదేళ్ళలో చేశారని కూనంనేని ఆరోపించారు. కొనుగోలు.. అమ్మకాలు చాలా చూశాం.. అమ్ముడు పోయిన వాళ్ళు ఒక్కడు కూడా అసెంబ్లీకి రాలేదని విమర్శించారు. ప్రజలు గమనిస్తున్నారు.. ఎమ్మెల్యేల కొనుగోలు చేసి తప్పు చేసింది టీఆర్‌ఎస్సేనన్నారు. దాంతో నెగిటివ్‌ వచ్చింది.. స్వేచ్ఛ లేకుండా పోయిందని తెలిపారు. ఉద్యమ పార్టీ అధికారంలోకి వచ్చి.. 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఎంత మంది ఎన్ని రోజులు హౌస్‌ అరెస్ట్‌ అయ్యారో లెక్క బయట పెట్టండని తెలిపారు. ప్రజలు పంజరం నుండి బయట పడ్డట్టు ఫీల్‌ అవుతున్నారని అన్నారు. ధర్నాలు చేసే అవకాశం లేదు.. సమ్మెలు చేస్తే ఉద్యోగాలు తీసేశారని కూనంనేని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు