Tuesday, May 7, 2024

తెలంగాణాలో బీజేపీని అధికారంలోకి తెద్దాం

తప్పక చదవండి
  • పిలుపునిచ్చిన బీజేపీ లీడర్‌ గజ్జల యోగానంద్‌..
  • సాంకేతిక నైపుణ్యంతో సమస్యలపై అవగాహన కలిగిన నాయకుడు..
  • పలు సేవా కార్యక్రమాలతో ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం..
  • గజ్జలతోనే నడుస్తాం అంటున్నశేరిలింగంపల్లి ప్రజానీకం..

హైదరాబాద్‌ : సమాజ పునర్నిర్మాణానికి నేనున్నానంటూ ముందుండే ప్రజల మనిషి, స్ఫూర్తి ప్రదాత గజ్జల యోగానంద్‌, నిర్మాణ, ఆతిథ్య రంగాల్లో విశేష అనుభవం, నైపుణ్యం గల టెక్నోఫూనర్‌, ప్రభావశీల నేత, మంజీర గ్రూప్‌ ఛైర్పర్సన్‌, ఎండీ అయిన యోగానంద్‌ సామాజికంగా తమ బాధ్యతలను నెరవేర్చుతూ.. ప్రజా జీవితం లో క్రియాశీలులై అసంఖ్యాకుల హృదయాలలో సుస్థిర స్థానం పొందారు..

యోగానంద్‌ విద్యార్థి దశ నుండి సామాజిక, రాజకీయ దృక్పథాన్ని కలిగిన నాయకుడిగా.. ఉస్మానియా పూర్వ విద్యార్థులకు సుపరిచితులే, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ సభ్యునిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం యొక్క స్వయం ప్రతిపత్తిని పునరుద్దించడానికి చేసిన పోరాటంలో విశ్వవిద్యాలయ భూములను అసాంఘిక వ్యక్తుల ఆక్రమణ నుండి కాపాడడం, ఇతర విద్యా సంక్షేమ అంశాలపై జరిగే ప్రతి పోరాటంలో ముందున్నారు.. విద్యార్థి దశలోనే ఆర్‌.ఎస్‌.ఎస్‌. సిద్ధాంతాలకు ఆకర్షితులై జాతి నిర్మాణానికి తగు శిక్షణ పొందారు. యోగానంద్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి సివిల్‌ ఇంజనీరింగ్‌ డిగ్రీ తీసుకున్న తర్వాత బెంగళూరులోని ప్రతిష్టాత్మమైన ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆ సైన్స్‌ నుండి సివిల్‌ ఇంజనీరింగ్‌ లో కీలకమైన స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌ లో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు..

- Advertisement -

అనంతరం మరో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్మెంట్‌, బెంగళూరు నుండి బిజినెస్‌ లీడర్షిప్‌ ప్రోగ్రాం కూడా పూర్తి చేయడం జరిగింది. విద్యార్థి ఉద్యమాలలో పాల్గొనడం ద్వారా లభించిన నాయకత్వ దక్షతకు తోడు సివిల్‌ ఇంజనీరింగ్‌ లో సాధించిన నైపుణ్యంతో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టారు.. దేశంలో పట్టణీకరణ నిర్మాణ రంగాలలో కీలక మార్పులను తీసుకొని రావడంపై దృష్టి కేంద్రీకరించిన కొద్ది మందిలో యోగానంద్‌ ఒకరు.. పట్టణాలలో పేద, మధ్యతరగతి వారికి సరసమైన ధరలలో కొనగలిగే సుస్థిర, సానుకూల జీవనాన్ని కొనసాగించడానికి కావలసిన పట్టణ గృహ నిర్మాణాలు అందించడం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఈ రంగంలో యోగానంద్‌ చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణ, పేదరిక నిర్మూల మంత్రిత్వ శాఖ సలహాదారుడుగా నియమించుకుంది.. యోగానంద ఐ.ఐ.ఎం. విశాఖపట్నం పాలక మండలి సభ్యునిగా సేవలు అందించారు.. ప్రస్తుతం ఐఐటి తిరుపతి పాలకమండలి సభ్యులుగా, ఎన్‌ ఐ టి క్యాలికట్‌ పాలక మండలి అధ్యక్షులుగా విద్యారంగానికి గణనీయమైన సేవలు అందిస్తూ.. మార్గ నిర్దేశం చేస్తున్నారు. ఏ.ఐ.సి.టి.ఈ., సి.ఆర్‌.ఈ.డీ.ఏ.ఎల్‌., ఎఫ్‌.టి.సి.సి.ఐ., ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌, ఇండియా కాంక్రీట్‌ ఇనిస్టిట్యూట్‌, ఏసీసీఈ. ఎన్‌.యూ.ఎం. సంస్థల్లో పలు హోదాలు నిర్వహించి, ఈ సంస్థల ద్వారా సమాజ నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు.. పోషిస్తున్నారు.. అత్యున్నత విద్య, జ్ఞానాన్ని ఆర్జించిన యోగానంద్‌ తన విజ్ఞానాన్ని సమాజ ఉన్నతికి వినియోగించారు.. సామాజిక, పర్యావరణ కార్యకలాపాల్లో విశేష అనుభవంతో పౌర జీవనంలో ముఖ్యమైన జల సంరక్షణ, గణ వ్యర్ధాల నిర్వహణ, మురుగు నీటి పునర్‌ వినియోగం, సురక్షిత త్రాగునీరు వంటి విభాగాల్లో ఉత్తమ విధానాల రూప కల్పనకు చేయూతనిచ్చారు. నగరంలో ఎస్‌.టి.పీ. ఉన్నత ప్రమాణాలలో నెలకొల్పిన వారిలో యోగానంద్‌ ప్రముఖులుగా గుర్తింపు పొందారు. ప్రజాజీవన ప్రమాణాలపై లోతైన పరిజ్ఞానాన్ని ఘడిరచిన యోగానంద్‌ జాతి నిర్మాణం అంటే భౌతిక సదుపాయాలు మాత్రమే కాదని విద్య, వైద్యం, ఆరోగ్యం వంటి కీలక అంశాలలో ప్రజల జీవన శైలిని మెరుగుపరిచి ఉత్తమమైన సమాజాన్ని నిర్మించినప్పుడే భారత ఉత్తమ బిడ్డగా తన జీవితం సార్థకం కాగలదని గుర్తించారు. సమానత్వంతో విలసిల్లే సత్యవంతమైన దేశాన్ని రూపొందించుకునేందుకు భారతీయ జనతా పార్టీ తమకు తగిన వేదిక కాగలదన్న విశ్వాసంతో యోగానంద్‌ ఈ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు.. 2018 హైదరాబాద్‌ లోని శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రజలకు దగ్గరయ్యారు.. రాజకీయ రంగ ప్రవేశం ద్వారా సమాజపు మూలాలతో మరింత సన్నిహితమై వ్యవస్థలోని క్షేత్రస్థాయి సమస్యలు, సవాళ్లపై నిశిత పరిశీలన చేస్తూ.. ముందడుగు వేస్తున్నారు.. భారత ప్రధాని నరేంద్ర మోదీ పథకాల అమలకు కృషి చేస్తున్నారు. సామాజిక సేవ తత్పరతతో జీవై ఫౌండేషన్‌ సేవా సంస్థను యోగానంద్‌ నెలకొల్పారు, లాక్‌ డౌన్‌ కాలంలో సేవా భారతి, రోటరీ, వీ,ఎఫ్‌,ఈ, వీబీఎఫ్‌ వంటి సంస్థలతో కలిసి పనిచేసి, వేలాదిగా నిరుపేదలకు ఆహారం, నిత్యావసరాల గ్రోసరీ కిట్స్‌, మాస్కులు, శానిటైజర్లతో పాటు అవసరమైన వారికి నగదు సాయం చేసి ప్రశంసలకు పాత్రుడయ్యారు.. జీవై ఫౌండేషన్‌ ను విశ్వగురు వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థ కరోనా వారియర్స్‌ ఇంటర్నేషనల్‌ పురస్కారంతో గుర్తించింది..

పౌండేషన్‌ ద్వారా సహాయం అందుకున్న వారిలో పలువురు క్రీడాకారులతో పాటు వివిధ రంగాల సంస్థలు కూడా ఉన్నాయి.. పౌర సమస్యల పరిష్కారానికి పౌండేషన్‌ ద్వారా సిటిజన్‌ కన్సల్టేషన్‌ సెంటర్‌ ను ఇటీవల నెలకొల్పారు.. పౌరుల కర్తవ్య పాలన, సమస్యల పరిష్కారంలో వారి హక్కులు బాధ్యతలపై అవగాహన కలిగించడం ఉత్తమ సమాజ నిర్మాణంలో పౌరుల పాత్రకు గల ప్రాధాన్యతను వారికి తెలియజేయడం, విద్యారంగా, మౌలిక వసతులు, ప్రజా రవాణా, ట్రాఫిక్‌ సమస్యలు వంటి నిర్దిష్ట పౌర సమస్యల పరిష్కారంలో పాలు పంచుకోవడం, ప్రభుత్వ యంత్రాంగపు పనితీరుని ప్రశ్నించడం వంటి కీలక అంశాల పై ఈ సెంటర్‌ దృష్టి సారించింది..
తాజాగా అప్‌ స్టెప్‌ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ వ్యవస్థకు తోడ్పాటును అందించడం జరిగింది.. లోటస్‌ పాండ్‌ పునరుద్ధరణలో అత్యంత కీలక పాత్ర వహించి అందరి మన్ననలను అందుకున్నారు.. జల సంపదే జాతికి మూలం అన్న సత్యాన్ని విశ్వసించిన యోగానంద్‌ తాను ఇంఛార్జి గా ఉన్న శేరిలింగంపల్లి నియోజికవర్గంతో పాటు జంట నగరాల్లోని చారిత్రిక సరస్సుల పరిరక్షణకు నడుం బిగించి.. అవి ఆక్రమణలకు గురి కాకుండా నిరోధించేందుకు నిరంతరం సర్కారును అప్రమత్తం చేస్తున్నారు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో శేరిలింగంపల్లిలో బీజేపీ గెలుపే లక్ష్యంగా యోగానంద్‌ నియోజకవర్గం పరిధిలో పాద యాత్ర ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికై కృషి చేస్తున్నారు.. బీ.అర్‌.ఎస్‌. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.. జాతి నిర్మాణం కోసం, జగతి కళ్యాణం కోసం, మనమందరం యోగానంద్‌ తో కలిసి పారిశ్రమిద్దాం… పురోగమిద్దాం…. భారత్‌ మాతా కీ జై!

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు