Tuesday, October 15, 2024
spot_img

వాజ్‌పేయికి నేతల ఘనంగా నివాళి

తప్పక చదవండి
  • స్మృతివనం వద్ద రాష్ట్రపతి, ప్రధాని నివాళులు
  • మంత్రులు, బిజెపి నేతలు ఘనంగా పుష్పాంజలి

న్యూఢిల్లీ : మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి 98వ జయంతి సందర్భంగా యావత్‌ భారతం ఆయన్ని స్మరించుకుంది. ఢిల్లీలో వాజ్‌పేయ్‌ స్మృతివనం వద్ద ప్రధాని మోడీ, రాష్ట్రపతి ద్రౌది ముర్ము, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, మంత్రులు, రాజ్‌నాథ్‌ సింగ్‌, జెపి నడ్డా, స్పీకర్‌ ఓం బిర్లా తదితరులు పుష్పాంజలి ఘటించారు. ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్‌ వేదికగా వాజ్‌పేయికి నివాళుల ర్పించారు. భారతదేశాన్ని బలోపేతం చేయడానికి, అభివృద్ధి చేయడానికి అటల్‌ బిహారీ వాయిపేయి తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవ మనందరికీ స్ఫూర్తిదాయకం. వాజ్‌ పేయి చేసిన అభివృద్ధి పనులను లక్షలాది మంది భారతీయుల జీవితాలను ప్రభావితం చేశాయని అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వాజ్‌పేయికి నివాళు లర్పించారు. భరతమాత వైభవాన్ని తిరిగి తీసుకు రావడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్న అటల్‌ జీ తిరుగులేని సూత్రాలతో దేశంలో సుపరిపాలన అందించారని గుర్తు చేసుకున్నారు. వాజ్‌పేయి తన దృక్పథాన్ని సాకారం చేయడం ద్వారా భారత రాజకీయాలకు కొత్త మార్గాన్ని అందించారని తెలిపారు. అద్వితీయ దేశభక్తుడైన అటల్‌ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా నివాళుర్పించారు.

ప్రధానిగా అటల్‌ దూరదృష్టితో తీసుకున్న అనేక నిర్ణయాలు.. నేడు బలమైన భారతదేశానికి పునాది అని చెప్పారు. వాజ్‌ పేయి చేసిన సేవలను స్మరించుకుంటూ మోడీ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ’సుపరిపాలన దినోత్సవాన్ని’ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటుంది. అందరికీ సుపరిపాలన దినోత్సవ శుభాకాంక్షలని చెప్పారు. వాజ్‌ పేయి అనగానే 1998లో పోఖ్రాన్‌ అణుపరీక్ష, 1999 కార్గిల్‌ యుద్ధంలో భారత్‌ విజయం ప్రతి భారతీయుడి మదికి గుర్తుకొస్తాయి. అయితే ప్రధాని వాజ్‌ పేయి హయాంలోనే 2001 డిసెంబర్‌లో పార్లమెంటు భవనంపై దాడి జరిగింది. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో, ఢిల్లీ -లాహోర్‌ బస్సు సర్వీస్‌ ఫిబ్రవరి 1999లో ప్రారంభించబడింది. ఇది భారతదేశం, పాకిస్తాన్‌ మధ్య సంబంధాలలో ఒక చారిత్రాత్మక చర్య అంటూ ప్రశంసలు అందుకుంది. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో జనతా పార్టీ విజయం సాధించింది. మొరార్జీ దేశాయ్‌ నేతృత్వంలోని ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా అటల్‌ బిహారీ వాజ్‌ పేయి పనిచేశారు. ఆ సమయంలో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో హిందీ భాషలో ప్రసంగించిన మొదటి నాయకుడు వాజ్‌పేయి. అప్పటి వరకూ ఈ ప్రపంచ వేదికపై ఎవరూ హిందీలో ప్రసంగం చేయలేదు. వాజ్‌పేయిని భారత ప్రభుత్వం మార్చి 27, 2015న దేశ అత్యున్నత పౌర పురస్కారం ’భారతరత్న’తో సత్కరించింది.భారతీయ జనతా పార్టీని విజయ శిఖరాలకు చేర్చడంలో వాజ్‌పేయి పాత్ర చాలా ముఖ్యమైనది. 1990వ దశకంలో, వాజ్‌పేయి బీజేపీ ముఖ్యమైన వ్యక్తిగా మారారు. 1996లో కేంద్రంలో మొదటిసారిగా.. బీజేపీ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిరది. అప్పుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి కేవలం 13 రోజులు మాత్రమే ప్రధానమంత్రిగా పదవిలో ఉన్నారు. పార్లమెంటులో పూర్తి మెజారిటీ రాకపోవడంతో ఆయన ప్రభుత్వం పడిపోయింది. అయితే, 1998లో అటల్‌ మళ్లీ ప్రధానమంత్రి పదవికి ఎన్నికయ్యారు. అనంతరం 1999 నుంచి 2004 వరకు మూడోసారి భారత ప్రధానిగా ఉన్నారు. వాజ్‌ పేయి 1957లో తొలిసారిగా ఉత్తరప్రదేశ్‌లోని బలరాంపూర్‌ నుంచి జనసంఫ్‌ు టిక్కెట్‌పై గెలిచి లోక్‌సభకు చేరుకున్నారు. అనంతరం అటల్‌ బిహారీ వాజ్‌పేయి గ్వాలియర్‌, న్యూఢల్లీి, లక్నో నుంచి 10 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. వాజ్‌పేయి 1924 డిసెంబర్‌ 25న గ్వాలియర్‌లోని షిండే కా బడా ప్రాంతంలో జన్మించారు. తల్లిదండ్రులు కృష్ణ బిహారీ వాజ్‌పేయి, కృష్ణ బాజ్‌పేయి. అటల్‌ తండ్రి ఉపాధ్యాయుడు. అటల్‌ బిహారీకి ముగ్గురు అన్నలు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఢల్లీిలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటూ 16 ఆగస్టు 2018న వాజ్‌పేయి మరణించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు