Friday, May 3, 2024

అమ్మవారి ఆలయంలో మోసగాళ్లు..

తప్పక చదవండి

శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కుంభకోణాల పర్వం

  • నిర్లక్ష ధోరణిలో ఎండోమెంట్‌ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌
  • అసమర్థ కమిషనర్‌ పై చర్యలు తీసుకోవాలంటున్న భక్తులు
  • అడ్డుకునేవారు ఎవరూ లేకపోవడంతో రెచ్చిపోతున్న వైనం..
  • న్యాయం కోసం హై కోర్టులో రిట్‌ పిటిషన్‌ వేసిన అఖిల భారత హిందూ
    మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాగిళ్ల శ్రీనివాస్‌
  • పోలీసులపై నమ్మకం లేక సీబీఐకి ఫిర్యాదు..
  • రంగ ప్రవేశం చేసిన సీబీఐ టీమ్‌.. ఇకనైనా తుట్టె కదిలేనా..?

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : అమ్మవారు అనగానే కరుణతో పాటు మహోగ్రరూపం కూడా గుర్తుకు వస్తుంది.. భక్తులను కాచే ఆమె.. దుష్టులను కఠినంగా శిక్షిస్తుందని.. నానుడి.. అందుకే ఆమెను సర్వశక్తి రూపిణిగా భక్తులు కొలుస్తారు.. ఈ కోవలోకే వస్తుంది సికింద్రాబాద్‌ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు.. స్వరాష్ట్రం నుంచే కాకుండా పలు రాష్ట్రాల భక్తులు ఈ అమ్మవారిని దర్శించుకుని.. తమ కోరికలు విన్నవించుకుని.. కానుక లు సమర్పించుకుంటారు.. చిన్నా పెద్దా, పేద గొప్ప తారతమ్యం లేకుండా ఈమె సన్నిధికి వస్తుంటారు భక్తజనం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ దేవాలయంలో బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతుంది.. ప్రభుత్వం తరఫునుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.. ఇక రంగం రోజు భవిష్యవాణి వినిపిస్తుంది అమ్మవారు.. ఇది ఎంతో ప్రసిద్ధిచెందిన ప్రక్రియ..

- Advertisement -

అయితే దురదృష్టం ఏమిటంటే.. ఈ ఆలయంలో ఎన్నెన్నో కుంభకోణాలు జరుగుతున్నాయి.. ఈ కుంభకోణాలను సాక్షాలతో సహా బయట పెట్టడం జరిగింది ఆదాబ్‌ హైదరాబాద్‌.. ఈ వ్యవహారాలపై వరుస కథనాలను కూడా ప్రచురించింది.. కాగా అఖిల భారత హిందూ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాగిళ్ల శ్రీనివాస్‌ ఈ ఆలయ కుంభకోణాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు.. హైకోర్టులో సైతం రిట్‌ పిటిషన్‌ వేశారు.. అంతే కాకుండా పోలీస్‌ శాఖ మీద నమ్మకం లేక సీబీఐ కి కూడా ఫిర్యాదు చేశారు.. సీబీఐ తమ మిషన్‌ ని మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.. అయితే ఇంత జరుగుతున్నా దేవాదాయ శాఖ కమిషనర్‌ ఏమి చేస్తున్నట్లు..? ఎందుకు దోషులను శిక్షించలేకపోతున్నారు.. అవినీతి సొమ్ములో ఆయనకు కూడా వాటా ఉందా..? అన్నది ఇప్పుడు తేలాల్సి వుంది.. స్థూలంగా ఆలయంలో జరిగిన కుంభకోణాలను వరుస కథనాలతో మీ ముందుకు తేనుంది ఆదాబ్‌ హైదరాబాద్‌..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు