Tuesday, May 21, 2024

మళ్లీ మరోసారి గెలిపించండి

తప్పక చదవండి
  • కేసీఆర్‌ను మూడో సారి ముఖ్యమంత్రిగా దీవించండి
  • కాంగ్రెస్‌, బీజేపీ నాయకుల మాటలు నమ్మి ఓటర్లు మోస పోవద్దు
  • మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం కేసీఆర్‌ సహకారంతో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేశామని, ఈ ఎన్నికల్లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్‌ ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 51,13 డివిజన్‌ పరిధిలోని టవర్‌ సర్కిల్‌ రామచంద్రపురం కాలనీ…. అంతకు ముందు 20, 21,1,2 డివిజన్‌ పరిధిలోని సీతారాంపూర్‌, ఆరెపల్లి, తీగలగుట్టపల్లి గ్రామాలలో మంత్రి గంగుల కమలాకర్‌ ప్రచారం నిర్వహించారు..ఈ సందర్బంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాకముందు కరీంనగర్‌లో రోడ్లు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉన్నాయో గమనించాలన్నారు..పదేళ్లలో కరీంనగర్‌ రూపురేఖలు మార్చి గొప్పగా అభివృద్ధి చేశామన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో వేల కోట్ల నిధులు తీసుకువచ్చి నగరంలోని అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా అభివృద్ధి పనులను చేపట్టామన్నారు….నగరంలో కొనసాగుతున్న ఈ అభివృద్ధి మరింత ముందుకు సాగాలంటే కేసీఆర్‌ను గెలిపించుకోవాలన్నారు…యాభై ఏండ్లకు పైగా అధికారంలో ఉన్నా కాంగ్రెస్‌ ప్రజలకు చేసిందేమీ లేదని… నాడు అన్నదాతను గోస పెట్టింది. కరెంట్‌ సక్కగియ్యలె. నీళ్లియ్యలె. కండ్ల ముందే పంటలు ఎండుతున్నా పట్టించుకోలె. ఆఖరుకు రైతు అప్పుల బాధతో సచ్చిపోయినా పట్టించుకోలెదని ఆవేదన వ్యక్తం చేసారు…బీజేపీ రాష్ట్రంలో ఎక్కడా గెలిచేది లేదన్నారు. అలాంటి పార్టీకి ఓటు వేసి వృథా చేసుకోవద్దని సూచించారు. అసమర్థ ఎంపీ ఉండడం వల్ల కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా నిధులు తీసుకురాలేకపోయారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులు ఇద్దరూ ఒకటేనని విమర్శించారు.. కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల కుట్రలను తిప్పి కొట్టలని అన్నారు.. తెచ్చకున్న తెలంగాణ దొంగల పాలు కాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నగరంలో చేపడుతున్న మానేరు రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేస్తానన్నారు..పదేళ్లలో కరీంనగర్‌ రూపురేఖలు మార్చి గొప్పగా అభివృద్ధి చేశామన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో వేల కోట్ల నిధులు తీసుకువచ్చి నగరంలోని అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా అభివృద్ధి పనులను చేపట్టామన్నారు…రైతుబంధు ఇవ్వడం తో పాటు ధాన్యం కొంటున్నాం అని బీజేపీ కాంగ్రెస్‌ పార్టీలకు ఓటేస్తే పనికిమాలిన ప్రభుత్వమే వస్తదని నగరాన్ని ఇంత మంచిగా అభివృద్ధి చేస్తున్నాం..కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని జారవిడుచు కోవద్దని అన్నారు… ఈ కార్యక్రమంలో నగర మేయర్‌ యాదగిరి సునీల్‌ రావు , సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ చైర్మన్‌ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ , కార్పొరేటర్లు జంగిలి సాగర్‌, తుల రాజేశ్వరి బాలయ్య కాశెట్టి శ్రీనివాస్‌.. నాయకులు ఏవి రమణ దాసరి సాగర్‌ కొమ్ము భూమయ్య, సాధినేని మునిరాజ్‌.. తదితరులు ఉన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు