Wednesday, September 11, 2024
spot_img

వీడిన ఉత్కంఠ…

తప్పక చదవండి
  • బారాస పది స్థానాల్లో అభ్యర్థులు ఎంపిక
  • సంబరాలు చేసుకుంటున్న ఖమ్మం నేతలు
  • అభ్యర్థులకు అభినందనల వెల్లువ
    ఖమ్మం : భరాసాఆభ్యర్థులు ఉత్కంఠ వీడిరది.. ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా అభ్యర్థుల జాబితా ముఖ్యమంత్రి కేసీఆర్‌ విడుదల చేయడంతో నాయకులందరూ ఊపిరిపించుకున్నారు. వైరా సెట్టింగ్‌ స్థానం మినహా మిగిలిన చోట్ల పాత వారిని ఎంపిక చేసి ముఖ్యమంత్రి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో పలువురు అభ్యర్థులపై అసంతృప్తి వస్తున్నప్పటికీ వాటన్నిటినీ లెక్కచేయకుండా మొదటి జాబితాలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా లిస్టు ఫైనల్‌ చేశారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం పది అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో 8 మంది ఎమ్మెల్యేలు భారాసకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పనితీరు, ప్రజల్లో ఆదరణ, సర్వే ఫలితాల ఆధారంగా వచ్చే ఎన్నికలకు అభ్యర్థులెవరో అధిష్ఠానం ప్రకటించింది. ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్‌కుమార్‌, పాలేరు కందాళ ఉపేందర్‌రెడ్డి, మధిర లింగాల కమల్‌రాజు, సత్తుపల్లి సండ్ర వెంకటవీరయ్య, కొత్తగూడెం వనమా వెంకటేశ్వరరావు, పినపాక రేగా కాంతారావు, అశ్వారావుపేట మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందు బానోత్‌ హరిప్రియ, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు, వైరా నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే రాములునాయక్‌కు బదులు మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్‌ ను ఎంపిక చేశారు..
    ఆనంద డోలికల్లో అభ్యర్థులు..కేసీఆర్‌ ప్రకటించిన తొలి దశ జాబితాలోనే స్థానం సంపాదించిన అభ్యర్థులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. ఇంటెలిజెన్స్‌ సర్వే మొదలు.. పలు నివేదికలు తెప్పించుకొని మరీ వడపోసిన తర్వాత.. అభ్యర్థులను ఖరారు చేశారు కేసీఆర్‌. మొన్నటి వరకూ సిట్టింగులను చాలా మందిని మారుస్తారని ప్రచారం సాగింది. అయితే.. అన్ని సమీకరణాలనూ లెక్కలోకి తీసుకున్న భారాస అధినేత.. మరీ తప్పదు అనుకున్న చోట్ల మాత్రమే సిట్టింగులకు మొండిచేయి చూపించారు. దీంతో.. గెలుపు గుర్రాల జాబితాలో తామూ చోటు సంపాదించినందుకు అభ్యర్థులంతా సంతోషం చేస్తున్నారు. దీంతో ఆయా నియోజకవర్గ అభ్యర్థులకు పలువురు నాయకులు అభినందనలు తెలియజేస్తున్నారు. క్యాంపు కార్యాలయానికి వెళ్లి ప్రచార ఘట్టాన్ని ప్రారంభించారు. ఉమ్మడి జిల్లాలో అభ్యర్థుల క్యాంప్‌ కార్యాలయాల వద్ద బాణా సంచారం సైతం పేలుస్తున్నారు. ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు ఉమ్మడి జిల్లా అభ్యర్థులకు స్వయంగా ఫోన్‌ చేసి అభినందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు కృతజ్ఞతలు తెలియజేశారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో స్ధానిక ఎమ్మేల్యే, మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ని ఖమ్మం నియోజకవర్గ పార్టీ అభ్యర్థిత్వాన్ని పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఖరారు చేసిన సందర్భంగా మేయర్‌ పునుకొల్లు నీరజ, అర్‌ జే సి కృష్ణ కలిసి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య యువజన సంఘం నాయకులు చింతనిపు కృష్ణ చైతన్య కలిసి అభినందించారు. ఇలా ఆయా నియోజకవర్గాల్లో నాయకులు సంబరాలు మునిగిపోయారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు