Sunday, September 24, 2023

బస్తీ రోడ్డు ఇలా.. రాకపోకలు ఎలా…?

తప్పక చదవండి

జల్‌పల్లి : జల్‌పల్లి పురపాలక సంఘంలో ఉన్న అంతర్‌ రాష్ట్ర రహదారి శ్రీశైలం హైవే కు అనుసంధానంగా ఉన్న 23వ వార్డులోని రోడ్డుపై సరైన మురుగు పారుదల వ్యవస్థ లేకపోవడంతో రోడ్డు ఇరువైపులా ఉన్న ఇండ్లతో పాటు ప్యారడైస్‌ ఫంక్షన్‌ హాల్‌ నుండి వచ్చే మురుగు నీటితో 10, 11, 23 వార్డుల లోని ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు ఇబ్బందికరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ఫంక్షన్‌ హాల్‌ నుండి వచ్చే మురుగు నీటిని దారి మాలించుటకు యజమాని రహదారిపై అడ్డంగా మట్టి కుప్ప వేయడంతో అక్కడ విద్యుత్‌ దీపాలు లేక కుటుంబ సభ్యులతో రాత్రి వేళలో వచ్చే వాహనదారులు జారీ క్రింద పడుతున్నారని, ఇప్పటికీ గుంతలమయమైన రోడ్డుపై చిన్నపాటి వర్షం పడినా మురుగునీరు, వర్షపునీరు ఏకమై పొంగిపొర్లతు ప్రధాన రహదారిని ముంచెత్తుతుంది. ఈ రహదారి మూడు వార్డులకు అనుసంధానంగా ఉండడంతో సమస్యను పలుమారు సంబంధిత జల్‌పల్లి పురపాలక సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ప్రయోజను ఉంచటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక కౌన్సిలర్‌, మున్సిపాలిటీ అధికారులు పర్యటించి శాశ్వతంగా సమస్యని పరిష్కరిం చేందుకు చొరవ చూపాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు