Sunday, April 28, 2024

ఆత్మ స్తైర్యం కోల్పోవద్దు .. అధైర్య పడవద్దు..

తప్పక చదవండి
  • నారా భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపిన
    టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, జాతీయ కార్యదర్శి వీరేష్ ముదిరాజ్ లు..
  • కుటుంబానికి తెలంగాణ టీడీపీ అభిమానులు బాసటగా ఉంటారని హామీ..
  • ప్రపంచం వ్యాప్తంగా చంద్రబాబు నాయుడికి సంపూర్ణ మద్దతు లభించింది..
  • ఆయన కడిగిన ముత్యంలా త్వరలో బయటకు వస్తారు : కాసాని జ్ఞానేశ్వర్.

హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని గురువారం రాజమండ్రిలోని భువనేశ్వరి నివాస గృహంలో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ కలిసి సంఘీభావం తెలియజేశారు. గత నెల సెప్టెంబర్ 10న చంద్రబాబు నాయుడును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలంగాణ టీడీపీ నాయకులతో కలిసి రాజమండ్రి చేరుకొని అక్కడే బస చేసిన నారా భవనేశ్వరిని కలిసి సంఘీభావం తెలిపారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు, రిమాండ్ ను నిరసిస్తూ నారా, నందమూరి కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్, కాసాని వీరేష్ లు తమ నైతిక మద్దతును తెలియజేశారు. కాసాని జ్ఞానేశ్వర్ వెంట టీడీపీ జాతీయ క్రమశిక్షణ కమిటీ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు, బిసి సెల్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి సతీష్, ఎస్సి సెల్ రాష్ట్ర అధ్యక్షుడు పొలంపల్లి అశోక్, రాష్ట్ర టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి మేకల భిక్షపతి ముదిరాజ్, నల్గొండ పార్లమెంటు అధ్యక్షుడు కసిరెడ్డి శేఖర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

ప్రపంచం వ్యాప్తంగా చంద్రబాబుకు మద్దతు లభించింది :
ఆయన కడిగిన ముత్యంలా త్వరలో బయటకు వస్తారు : కాసాని జ్ఞానేశ్వర్.

- Advertisement -

జాతీయ స్థాయిలో సీనియర్ నేతగా ఉన్న చంద్రబాబుపై ఎలాంటి అవినీతి మచ్చలేదని, కానీ రాజకీయ కక్ష్యసాధింపులో భాగంగానే జగన్ ప్రభుత్వం ఆయన్ని అక్రమ కేసులు బనాయించిందని జ్ఞానేశ్వర్ అన్నారు. నారా చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేయలేదని ప్రపంచం మొత్తానికి తెలుసునన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రధాతగా, ఐటీ వైభవ మూల విరాట్ గా, రాష్ట్ర ఆర్థిక సంపత్తిని 10 వేల కోట్ల నుండి 60 వేల కోట్లకు తీసుకెళ్లిన విజనరీ లీడర్ గా ఆయన్ని తెలుగు ప్రజలే కాకుండా ప్రపంచం మొత్తం గుర్తించి గర్విస్తుందని పేర్కొన్నారు. అక్రమ కేసుల నుండి కడిగిన ముత్యంలా చంద్రబాబు త్వరలోనే బయటకు వస్తారని, తెలుగుదేశం పార్టీ శ్రేణులు యావత్తు చంద్రబాబుతో పాటు నారా, నందమూరి కుటుంబాలకు బాసటగా ఉన్నాయని నారా భువనేశ్వరికి జ్ఞానేశ్వర్ వివరించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి రావడం తథ్యమని అన్నారు. ఓటమిని గ్రహించే వైఎస్ జగన్, చంద్రబాబును నేరుగా ఎదుర్కొలేక ఆయనను అక్రమ కేసుల్లో ఇరికించే కుట్రకు తెరలేపాడని, జగన్ కుయుక్తులను వచ్చే ఎన్నికల్లో ఓటుతో తెలుగు ప్రజలు తిప్పికొడతారని కాసాని పేర్కొన్నారు. గెలుపు లక్ష్యం చేరుకునేదాకా టీడీపీ కేడర్ పోరాటాలకు సిద్ధం కావాలని, తెలంగాణ రాష్ట్రంలోనూ టీడీపీ పునర్ వైభవం దిశగా ఎన్నికల్లో సత్తా చాటుతామని కాసాని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు