Wednesday, September 11, 2024
spot_img

గిదేంది భయ్యా..?

తప్పక చదవండి

( బోగస్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేసి, పైసల్ వసూల్ చేసిన సర్కారీ నౌకర్లు ఎవరు..? )

  • జీ.హెచ్.ఎం.సి. ఖైరతాబాద్ జోన్.. కిస్సా అట్లనే కొడ్తుంది..
  • అనుమతులు ఒక లెక్కన ఉన్నయ్..
  • ఆక్యుపెన్సీ సర్టిఫికెటేమో మరో లెక్కన ఉన్నది..
  • పైసల్ ఇస్తే జీ.హెచ్.ఎం.సి.లో ఏ పనైనా అయితది..

హైదరాబాద్ : దేశంల జీ.హెచ్.ఎం.సి. కి మస్తు పేరున్నది.. గసువంటి జీ.హెచ్.ఎం.సి. ల దో నంబర్ దందా గూడా మస్తుగనే నడుస్తది.. పైసల్ ఇస్తే ఈడ కొలువు జేసే సర్కార్ నౌకరీగాళ్ళు కొంతమంది తిమ్మిని బమ్మిని జేస్తరు.. బమ్మిని తిమ్మిని జేస్తరు.. అసువంటి కథే గిప్పుడు బయటకొచ్చింది.. ఒక అనుమతులు దీస్కుని నిర్మాణాలు జేస్తే.. పైసలు దీసుకున్న నౌకరు సార్లు ఇంకో తీరుగా నిర్మాణాలు జేసినా వాళ్లకు బోగస్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇచ్చిన్రు.. అయితే ఈడ అర్ధం గాని విషయం ఏందంటే.. గీ సర్టిఫికేట్ ఇచ్చిన సర్కార్ అధికారి ఎవరు..? గాయన ఎన్ని పైసలు తీస్కున్నడు..? అన్నది తెలుస్తలేదు.. ఈ లెక్కన లక్షలకు లక్షలు వసూల్ జేస్తున్నట్టు పుకార్లు షికార్లు జేస్తున్నయ్.. మరి అసలు ఈడ జరుగుతున్న యవ్వారం ఏంది..? దేనెన్క ఎవరెవరున్నరు..? ఎన్ని పైసల్ చేతులు మారినయ్..? గీ లెక్కన బల్దియాకు ఎన్ని కోట్ల రూపాయలు లుక్ సాన్ జరుగుతున్నట్టు..? గీ బద్మాష్ గాళ్ళ ముచ్చట్లన్నీ సాబూత్ లతో ఇంకో కహానీ తోని మీ ముందటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది ‘ఆదాబ్ హైదరాబాద్’..ఇగో యాద్ మరువకండి ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు