Wednesday, May 15, 2024

ఇచ్చిన హావిూని నిలబెట్టుకున్న ఘనత మాది

తప్పక చదవండి
  • 370 ఆర్టికల్‌ మొదలు అన్ని హావిూలు నెరవేర్చాం
  • పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఇచ్చాం
  • విూ అండదండలతోనే ఇవన్నీ చేయగలిగాం
  • బిఆర్‌ఎస్‌ అవినీతిని తరిమి కొట్టాలి
  • కామారెడ్డి సభలో ప్రధాని మోడీ పిలుపు

కామారెడ్డి : ఇచ్చిన హావిూలను అమలు చేసిచూపిన సత్తా బిజెపిదని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణలోనూ బిసిని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు. కామారెడ్డి సభలో మాట్లాడుతూ కెసిఆర్‌ అవినీతిని అంతమొందించేందుకు ఇక్కడా ఓడించాలని పిలుపునిచ్చారు. బిఆర్‌ఎస్‌ అవినీతికి చరమగీతం పాడాలన్నారు. వాగ్దానం ఇచ్చామంటే అమలు చేసి తీరుతామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇచ్చిన హావిూలను నిలబెట్టుకున్నామని చెప్పారు. కామారెడ్డి నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి ప్రజలకు మంచి అవకాశం దక్కిందని అన్నారు. ఆర్టికల్‌ 370 రద్దు, ట్రిపుల్‌ తలాక్‌, అయోధ్య వంటి విషయాల్లో చిత్తశుద్దిని చాటుకున్నామని అన్నారు. గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తామన్న హావిూని నిలబెట్టామన్నారు. నిజామబాద్‌కు పసుపుబోర్డు ఇచ్చామని గుర్తు చేశారు. మాదిగల సమస్యలు ప్రస్తావిస్తూ వారికి కూడా పరిష్కారం చూపుతామని అన్నారు. ఇకపోతే టీఆర్‌ఎస్‌ హఠాత్తుగా బీఆర్‌ఎస్‌గా మారిందని, యూపీఏ కాస్త ఇండియా కూటమిగా మారిపోయిందని విమర్శించారు. ఇక్కడ జన ప్రవాహం కనిపిస్తోందని, దీన్ని బట్టి ప్రజలు కెసిఆర్‌పై ఎంతగా వ్యతిరేకతతో ఉన్నారో అర్థం చచేసుకోవ చ్చన్నారు. తొమ్మిదేళ్ల వారి పాలనపై ప్రజలు విసిగిపోయారు. ఇక్కడి ప్రజలు బీఆర్‌ఎస్‌ నుంచి విముక్తి కోరుతున్నారు. ఈసారి తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా విధానాలు ఉన్నాయి. నేను ఇచ్చే మాటలే గ్యారంటీ. దేశానికి బీసీని ప్రధాని చేసింది కూడా బీజేపీనే. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఎవరికి ఎప్పుడు డబ్బులు అవసరమైనా అప్పుడు నీటి పారుదల పథకాలు పెట్టుకున్నారు. ప్రజాధనం అంతా కేసీఆర్‌ కుటుంబ సభ్యుల జేబుల్లోకి వెళ్ళిందని మోదీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. ఆదివారం, సోమవారం కూడా ప్రచారం నిర్వహించ నున్నారు. కాగా రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రధాని మోదీ అన్నారు. ఖరీఫ్‌లో 20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం అదనంగా కొంటామని, ఇది తెలంగాణ రైతులకు ఎంతో మేలు చేస్తుందని మోదీ హావిూ ఇచ్చారు. ఏళ్ల తరబడి వేలాది మంది యువకులు ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. వారి అక్రమాల వల్ల నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ సీఎం, కాంగ్రెస్‌ అధ్యక్షుడు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని, వారి కుటుంబ పాలన, అవినీతి పాలన ఇక సాగదు అనేలా వారికి గుణపాఠం చెప్పాలని ఓటర్లను కోరారు. ‘ వారిద్దరు రెండు చోట్ల పోటీ చేస్తున్నారు. అక్కడ ఓడిపోతామనే భయంతో కామారెడ్డి వచ్చారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటే. డిసెంబర్‌ 3న ప్రజలు కేసీఆర్‌ను తరిమేసినట్లుగా తీర్పు రానుంది. విూ అందరి ఆశీర్వాదంతో మాకు 300 మంది ఎంపీలు ఉన్నారు. మేము బలహీనంగా ఉన్నపుడు విూరు అండగా ఉన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ వారు తమ బిడ్డల భవిష్యత్తు కోసం పని చేస్తే.. మేము విూ బిడ్డల భవిష్యత్తు కోసం పని చేస్తాం అని ప్రధాని మోదీ చెప్పారు.

- Advertisement -

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు