Friday, May 3, 2024

కరీంనగర్‌ జర్నలిస్టుల నివాస స్థలాల్లో అక్రమాలు

తప్పక చదవండి
  • రద్దు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించా..
  • అర్హులైన ప్రతి జర్నలిస్టుకు నివేశన స్థలాలిస్తాం
  • అర్హులైన జర్నలిస్టుల జాబితా బాధ్యత టియుడబ్ల్యూజే చూసుకుంటుంది
  • అందులో మా ప్రమేయం కానీ, కాంగ్రెస్‌ నేతల ప్రమేయం కానీ ఉండదు
  • కరీంనగర్‌ చుట్టుపక్కల భూముల ఆక్రమణలు జరిగాయి
  • భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతాం..
  • అన్యాయానికి గురైన బాధితులు ఫిర్యాదులు ఇవ్వండి
  • రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌

కరీంనగర్‌ : గతంలోని తప్పిదాలను సరిదిద్ది అర్హులైన ప్రతి జర్నలిస్టుకు నివేశన స్థలాలు అందజేస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ హామీ ఇచ్చారు. ఇటీవల పంపిణి చేసిన జర్నలిస్టుల నివేశన స్థలాలలో అక్రమాలు జరగడంతో వాటిని నిలిపివేయాలని జిల్లా కలెక్టర్‌ కు ఆదేశాలు ఇచ్చామని స్పష్టం చేశారు. త్వరలో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో అర్హులైన జర్నలిస్టుల లిస్టు తయారు చేసి నోటీసు బోర్డు అంటించి, ఆ తర్వాత తన దృష్టికి తీసుకువస్తే వాటికి ప్రభుత్వ ఆమోదముద్ర వేయిస్తానని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తరువాత కరీంనగర్‌ కు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌, మానకొండూర్‌ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారా యణలకు ఆదివారం స్థానిక ప్రెస్‌ భవన్‌ లో టీయు డబ్ల్యూజే కరీంనగర్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. అంతకుముందు కట్ట రాంపూర్‌ అభయాంజనేయ స్వామి ఆలయ అర్చకులు రవి శర్మ, ప్రసాద్‌శర్మ, సుగుణాకర్‌ ఆధ్వర్యం లో జిల్లా యూ నియన్‌ అధ్యక్షుడు తాడూరు కరుణాకర్‌ మంత్రికి పూర్ణకుం భంతో స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి ప్రభాకర్‌, ఎమ్మెల్యే సత్యనారాయణలను శాలువాలు కప్పి పుష్పగు చ్చాలను అందించి జర్నలిస్టులు ఘనంగా సత్కరిం చారు. అనం తరం మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ, భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని, ఎవరైనా అన్యాయానికి గురైన బాధితులుంటే పోలీసులకు ఫిర్యాదులు చేయాలని సూచిస్తూ, బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను కోరారు. పదవులు, అధికారం శాశ్వ తం కాదని, పత్రిక స్వేచ్ఛను రక్షిస్తా మని, పత్రిక వ్యవస్థ, జర్నలిస్టులు కూడా తమ బాధ్యతను విస్మరిం చవద్దని కోరారు. గడచిన దశాబ్ద కాలంలో జర్నలిస్టులు అనేక అవ మానాలు, వేధింపులకు గురయ్యారని చెప్పారు. నాయ కుల అడుగులకు మడుగులొత్తే వ్యవస్థ మారాలని, జర్నలిస్టుల నుండి పరిశోధనాత్మక వార్తలు రావాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ప్రాధాన్యత క్రమం ప్రకారం వాటిని పరిష్కరిస్తుం దని తెలిపారు. జర్నలిస్టుల సమస్యలను తమ సమస్యలుగా భావించి పరిష్కరిస్తామని అన్నారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజా పాలన కార్యక్రమాన్ని జర్నలి స్టులు వినియోగించుకోవాలని సూచించారు. మానకొండూర్‌ ఎమ్మె ల్యే సత్యనారాయణ మాట్లాడుతూ, ఒకప్పుడు పత్రికలో వార్త వస్తే చర్యలుండేవని, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కృషిచేస్తుం దని, అన్ని సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తుందని అన్నారు. టీయుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు తాడూరు కరుణాకర్‌ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలను వివ రించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ నివేశన స్థలాలు ఇప్పిం చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బల్మూరి విజయసిం హారావు, ఈద మధుకర్‌ రెడ్డి, జాతీయ కౌన్సిల్‌ సభ్యులు ఎలగం దుల రవీందర్‌, జానంపేట మారుతి స్వామి, జిల్లా కోశాధికారి సందీప్‌, నాయకులు అసద్‌, జగన్నాధ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, గంగం రాజులతో పాటు వివిధ ప్రెస్‌ క్లబ్‌ బాధ్యులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు