- హైదరాబాద్ శివార్లలో 6.5కోట్ల నగదు పట్టివేత
- ఎన్నికల నేపథ్యంలో భారీ ఎత్తున పట్టుబడుతున్న డబ్బు
- అప్పా జంక్షన్ వద్ద ఆరు కార్లలో నగదు పట్టివేత
- ఖమ్మం జిల్లా నాయకుడిదిగా అనుమానం..?
హైదరాబాద్ : ఎన్నికల వేళ తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. నగర శివార్లలో చేపట్టిన తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ప్రకియలో భాగంగా పోలీసులు నగరంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భారీగా నగదును పట్టుకున్నారు. సుమారు 6.5 కోట్లు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బండ్లగూడ అప్పా జంక్షన్ వద్ద అధికారులు డబ్బులు పట్టుకున్నారు. ఆరు కార్లలో డబ్బులు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఖమ్మం జిల్లాకు చెందిన నేతకు సంబంధించిన నగదుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈక్రమంలో తెలంగాణ ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడుతోంది. ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోన్న పోలీసులు సరైన పత్రాలు లేకుండా సొమ్ము తరలిస్తే సీజ్ చేస్తున్నారు. తాజాగా, హైదరాబాద్ ఓఆర్‌ఆర్ అప్పా కూడలి వద్ద నిర్వహించిన సోదాల్లో 6 కార్లలో రూ.6 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు చూపించకపోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ నగదు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ నేతదిగా పోలీసులు అనుమానిస్తున్నారు. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్న అధికార, ప్రతిపక్ష నేతల వాహనాలను సైతం చెక్ చేస్తున్నారు. కేంద్ర బలగాల సమన్వయంతో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తూ సరైన పత్రాలు లేని నగదు, బంగారం సీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ రూ.500 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారం సీజ్ చేసినట్లు తెలుస్తోంది.