Saturday, April 27, 2024

వాసవి అర్బన్ కబంధహస్తాల్లో కోమటికుంట..

తప్పక చదవండి
  • ఎఫ్.టి.ఎల్. లో భారీ భవనాల నిర్మాణం..
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇరిగేషన్ ఏఈ, నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్….
  • రెండు కేసులు నమోదు అయిన అక్రమ నిర్మాణాన్ని ఆపని వాసవి అర్బన్..
  • అర్బన్ అక్రమాల వెనుక ఉన్న అధికార పార్టీ కీలక మంత్రి….
  • ఎఫ్.టి.ఎల్ లో నిర్మించిన భవనాలను కూలుస్తారా..?
    అధికారానికి, ఆమ్యామ్యాలకు అధికారులు దాసోహం అంటారా?

నీళ్లు, నిధులు నియమకాల ఆధారంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని చెరువుల, కుంటల పరిరక్షణతో పాటు వాటి అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి నిధులు కేటాయిస్తుంటే.. ఆయన మంత్రివర్గంలో ఉన్న ఓ కీలక మంత్రి మాత్రం ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే పనిలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.. మంత్రి హోదాలో ఉన్న ఆయన అక్రమాలను అరికట్టాల్సింది పోయి కుంటలు, చెరువులు చెరబడుతూ భారీ భవనాలు నిర్మిస్తున్న నిర్మాణ సంస్థలకు తెరచాటున అండదండలందిస్తుండడం ముఖ్యమంత్రి ఆశయానికి గండి కొట్టడమే అవుతోంది..

హైదరాబాద్ : ఆశయాలు ఉన్నతమైనా వాటిని నెరవేర్చే ప్రక్రియలో సక్రమంగా అధికారులు విధులు నిర్వహించకపోవడంతో పరిస్థితులు ఎప్పటికప్పుడు చేజారిపోతున్నాయి.. ప్రస్తుతం అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొంది.. ప్రజా ధనం వృధా కావడమే కాకుండా పాలక ప్రభుత్వానికి అప్రతిష్ట అంటుకుంటోంది.. వివరాలు చూస్తే.. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్, బాచుపల్లి పరిధిలో వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ భారీ భవనాల నిర్మాణం చేపట్టింది.. పక్కనే ఉన్న కోమటికుంట ఎఫ్.టి.ఎల్. లో రెండు భారీ భవనాలను నిర్మిస్తోంది.. వాసవి నిర్మాణ సంస్థ ఎఫ్టీఎల్ ను ఆక్రమించి నిర్మాణాలు చేబడుతోందని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, ఇరిగేషన్ ఏఈ తో పాటు, నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ అధికారులు చెప్పినా నిర్మాణ పనులు ఆపకుండా యధేచ్చగా అక్రమంగా నిర్మాణ పనులు చేస్తున్నారని, బాచుపల్లి పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.. వాసవి నిర్మాణ సంస్థ అక్రమాల వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఓ కీలక మంత్రి ఉన్నట్లు తెలుస్తోంది.. ఎఫ్.టి.ఎల్ లో నిర్మాణాలు చేపట్టారని ఫిర్యాదుల పేర్కొన్న అధికారులు నిర్మాణాలను కూల్చి వేయకుండా వెనుకడుగు వేయడంలో మతలబేంటి..? అన్నది అర్ధం కాని ప్రశ్నగా మిగిలిపోయింది.. కాగా ఆ బడా నిర్మాణ సంస్థకి తెరచాటున అండదండల అందిస్తున్న ఆ మంత్రి ఎవరు..? అనేది పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు తేనుంది… ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు