Sunday, September 15, 2024
spot_img

దర్జాగా అక్రమ నిర్మాణాలు..

తప్పక చదవండి
  • నార్సింగ్ మున్సిపాలిటీలో జోరుగా ఇల్లీగల్ కన్ స్త్రక్షన్స్
  • కాసుల కనక వర్షం కురిపిస్తున్న బహుళ అంతస్తులు
  • మామూళ్ల మాఫియాగా మారిన టౌన్ ప్లానింగ్ అధికారులు
  • నిర్మాణాలు చేపట్టాలంటే కమిషనర్ డిమాండ్ ఒక తీరు.. టిపిఓ చేసేది మరో డిమాండ్..
  • విచ్చల విడిగా సెల్లార్ తవ్వకాలు..

పనేంటి..? నీకెంత..నాకెంత..? అనే డైలాగ్ ఒక సూపర్ హిట్ సినిమాలో పాపులర్ డైలాగ్.. ఈ డైలాగ్ హీరో చెబుతుంటే ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు..నిజంగా సమాజంలో ఇలాంటి సంఘటనలు..జరుగుతాయా అనుకుంటూ థ్రిల్ ఫీల్ అయ్యారు.. కానీ కళ్లముందే యధార్ధంగా జరుగుతుంటే చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.. సినిమాను తలపిస్తున్న ఈ ఘటనలు నార్సింగి మున్సిపాలిటీలో గోచరిస్తున్నాయి.

హైదరాబాద్ : నార్సింగ్ మున్సిపాలిటీలో నిర్మాణాలు చేపట్టాలంటే కమిషనర్ ఒక్క రేటు, టిపిఓకు మరో రేటు చొప్పున చెల్లించుకుంటేనే సాధ్యపడుతుంది. అదనంగా సెల్లార్ నిర్మాణాలు చేపడితే చెల్లింపులు మరింతగా భారీగా పెరుగుతాయి.. నార్సింగ్ మున్సిపాలిటీ శివారు ప్రాంతం కావడంతో అభివృద్ధి పరంగా శరవేగంగా దూసుకుపోతుంది. ఇదే అదునుగా భావించిన రియాల్టర్లు ఇష్టానుసారంగా సెల్లార్లు, బహుళ అంతస్థుల నిర్మాణాలు యధేచ్చగా చేవడుతున్నారు. నార్సింగ్ మున్సిపాలిటీలో స్టిల్ ప్లస్ టు, త్రీ ఇంటి నిర్మాణ అనుమతులు తీసుకొని 7 ఫ్లోర్లు వరకు నిర్మాణాలు చేపడుతున్నా, టౌన్ ప్లానింగ్ అధికారులు చూసి చూడనట్లు వుండటంతో ఇక్కడ అవినీతి ఏ మేరకు జరుగుతుందో అర్థమవుతుందని సామాన్య ప్రజలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

కాసుల వర్షం కురిపిస్తున్న బహుళ అంతస్తులు నిర్మాణాలు :
గ్రేటర్ హైదరాబాద్ కు శివారు ప్రాంతంగా ఉన్న నార్సింగ్ మున్సిపాలిటీ బహుళ అంతస్తుల నిర్మాణాలతో కాసుల వర్షం కురిపిస్తున్నాయి. నామమాత్రంగా భవన ఫీజులు మున్సిపాలిటీకి చెల్లించి ఇష్టానుసారంగా నిర్మాణాలు చేపడుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఒకంత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. టౌన్ ప్లానింగ్ అధికారులకు అక్కడి మార్కెట్ వాల్యూ ప్రకారం లంచాలు చెల్లించుకుంటే ఎలాంటి నిర్మాణాలైనా చేపట్టుకోవచ్చని సంకేతాలు ఇస్తున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి.

విచ్చల విడిగా సెల్లార్ తవ్వకాలు :
నార్సింగ్ మున్సిపాలిటీలో ఎక్కడ చూసినా నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా సెల్లార్ నిర్మాణాలు చేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారానే ఆరోపణలు ఉన్నాయి. నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిగా సెల్లార్ల నిర్మాణాలతో ఏ క్షణానైన.. ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

భారీగా మున్సిపాలిటీకి ఆర్థిక నష్టం :
మున్సిపల్ కేంద్రంగా చేపడుతున్న నిర్మాణాలతో నార్సింగ్ మున్సిపాలిటీకి భారీ ఆర్థిక నష్టం కలుగుతుందని ప్రజలు ఎన్నిసార్లు ఆందోళన చేసిన పట్టించుకున్న నాథుడే లేడు. ఇక్కడ పనిచేస్తున్న అధికారులు కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నా, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడం అవినీతికి ఆజ్యం పోసినట్లు కనిపిస్తున్నాయి.

చక్రం తిప్పుతున్న టౌన్ ప్లానింగ్ కింది స్థాయి సిబ్బంది :
నార్సింగ్ మున్సిపాలిటీలో ఇలాంటి నిర్మాణం చేపట్టాలన్న టౌన్ ప్లానింగ్ కింది స్థాయి సిబ్బందిని ప్రసన్నం చేసుకుంటే చాలు. ఇక్కడ అదనపు నిర్మాణానికి ఒక రేటు, సెల్లార్ కు మరో రేటు చెల్లించుకుంటే దగ్గరుండి నిర్మాణాలు పూర్తి చేయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నార్సింగ్ మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు