Wednesday, October 16, 2024
spot_img

దమ్ముంటే హైదరాబాద్‌ వచ్చి నామీద పోటీ చెయ్‌..

తప్పక చదవండి
  • రాహుల్‌ గాంధీకి సవాల్‌ విసిరిన అసదుద్దీన్‌..
  • బీ.ఆర్‌.ఎస్‌.కు మద్దతు ఇస్తానని ప్రకటన..
  • కాంగ్రెస్‌ వల్లే హైదరాబాద్‌లో మత కలహాలు..

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ టార్గెట్‌గా ఏఐఎం ఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ విరుచుకుపడ్డారు. దమ్ముంటే హైదరాబాద్‌ వచ్చి రాహుల్‌ తనపై పోటీ చేయాలంటూ సవాల్‌ విసిరారు. మిలాద్‌ ఉన్‌ నబీ పర్వదినంలో భాగంగా ఎంఐఎం ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అసదుద్దీన్‌ ఓవైసీ తన పార్టీ నిర్ణయాన్ని ప్రకటించడంతోపాటు పలు కీలక అంశాలపై ప్రసంగించారు. టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు అధికారికంగా స్పష్టం చేశారు. ఎంఐఎం పోటీ చేయని చోట బీఆర్‌ఎస్‌కు సపోర్ట్‌ చెయ్యాలని పార్టీ సభ్యులకు కార్యకర్తలకు, ఓటర్లకు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో మతకలహాలన్నీ కాంగ్రెస్‌ వల్లే జరిగాయని.. బాబ్రీ మసీదు ఘటన కూడా కాంగ్రెస్‌ హయాంలోనే జరిగిందన్నారు. బాబ్రీ మసీదును పీవీ నరసింహారావు ప్రభుత్వ హయాంలో కూల్చివేశారని, దాన్ని తిరిగి నిర్మించలేదని.. కానీ తెలంగాణ సచివాలయంలో కూలిపోయిన మసీదును కేసీఆర్‌ కట్టించారంటూ గుర్తుచేసే ప్రయత్నం చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు