Wednesday, May 8, 2024

సోనియాగాంధీకి ప్రధాని మోడీ జన్మదినోత్సవ శుభాకాంక్షలు

తప్పక చదవండి

న్యూఢిల్లీ : యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాందీ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సోషల్‌ విూడియాలో సోనియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు నేతలు కాంగ్రెస్‌ నాయకురాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం సోనియాకు గ్రీటింగ్స్‌ తెలియజేశారు. ‘సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆమెకు సంపూర్ణమైన, ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’ అంటూ మోదీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు. మోదీతో పాటుగా కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖర్గే, కేసీ వేణుగోపాల్‌, శశి థరూర్‌, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ తదితరులు సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు