Sunday, April 28, 2024

ప్రభుత్వ సీలింగ్‌ భూమి మాయం..!

తప్పక చదవండి
  • పేదల అవసరాలు ఆసరాగా చేసుకుని రిజిస్ట్రేషన్‌..?
  • దర్జాగా ప్రహరీ గోడ, సీసీి కెమెరాల ఏర్పాటు
  • ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన

ప్రభుత్వం పేదలకు జీవనోపాధి కోసం సీలింగ్‌ భూములను కేటాయించింది. ఆ భూములను కేటాయించిన వ్యక్తి, వారి వారసత్వం అనుభవించాలి. లేదంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు.ప్రభుత్వ భూమి నేరుగా కొత్త వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్‌ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే నందిగామ గ్రామ శివారులోని సర్వేనెంబర్‌ 621/3 నందు 1-27 ఎకరాల భూమిని ప్రభుత్వం మంగలి లింగమయ్యకు సీలింగ్‌ పట్టా కేటాయించింది. ఈ భూమిపై ఓ వ్యాపారి కన్నుప‌డింది. ఎలాగైనా సొంతం చేసుకోవాలని దూరాశతో పేదల అవసరాలను ఆసరాగా చేసుకున్నాడు. అదే సమయంలో రిజిస్ట్రేషన్‌ కూడ శ్రీదేవి పేరుపై రిజిస్ట్రేషన్‌ కూడ చేయించారు. అసలు సీలింగ్‌ పట్టా భూములు అమ్మకాలు, కొనుగోలు చేయొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ, ఆ భూమిని ఏకంగా రిజిస్ట్రేషన్‌ చేసి రికార్డుల్లో నమోదు చేశారంటే అప్పటి అధికారులు ఏ స్థాయిలో పనిచేశారో అర్థం చేసుకోవచ్చు.పైగా ఈ భూమికి చుట్టూ ప్రహారి గోడ నిర్మించి,సీసీ కెమెరాల ఏర్పాటు చేశారు.సీలింగ్‌ భూముల మాయం అవ్వడానికి, అప్పటి రెవెన్యూ, ఇతర అధికారులు సహాయం చేశారని స్పష్టంగా కనిపిస్తోంది.ఈ విషయంపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి…

చర్యలు తీసుకుంటాం…
పేదలకు బ్రతుకు దేరువు కోసం ప్రభుత్వం ఇచ్చిన సీలింగ్‌ భూమి ప్రొహిబిషన్‌ లో ఉందిని తహశీల్దార్‌ రాజేశ్వర్‌ తెలిపారు. ప్రభుత్వ భూమి పేరు మారడం అనేది జరగని పని. భూమి ఎలా వచ్చింది, పేరు ఎలా మారింది అనే విషయం తెలుసుకునేందుకు ప్రస్తుతం పొజిషన్‌ లో ఉన్నవారికి నోటీసులు పంపిస్తాం. వారు ఇచ్చిన వివరణను ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందజేస్తాం. వారి సూచనల మేరకు చర్యలు తప్పకుండా తీసుకుంటాము…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు