Sunday, April 28, 2024

ప్రమాదం అంచున ప్రయాణం..

తప్పక చదవండి
  • పరిమితికి మించి ఆటోలో తరలిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం
  • ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్థులకు నరకప్రాయంగా మారిన ప్రయాణం

విద్యార్థుల ప్రాణాలతో కొంతమంది ఆటోడ్రైవర్లు చెలగాటమాడుతున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా పరిమితికి మించి విద్యార్థు లను ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్తున్నారు. పరీక్షా సమయం దగ్గర పడుతుంది అని ఆలోచనతో అతివేగంతో ప్రయాణం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఏదైనా ప్రమాదం జరిగితే.ఇక అంతే సంగతి అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎన్నో సందర్భాలలో ఇలా ప్రయాణించి విద్యార్థులు ఇబ్బందులు పడ్డ ఘటనలు ఎన్నో ఉన్నాయి.ఆటోడ్రైవర్‌ పరీక్షల సమయంలో పరిమితికి మించి విద్యార్థి విద్యార్థులను ఎక్కించుకొని పరీక్ష సెంటర్లకు డీజే పాటలు పెట్టుకుని రోడ్డుపై నిర్లక్ష్యంగా అతివేగంగా నడుపు తుంటారు .జిల్లాకేంద్రంలో అధిక సంఖ్యలో ప్రైవేటు పాఠశా లలు ,కళాశాలలు ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి రోజూ వేలాది మంది విద్యార్థులు ఆటోలు, వ్యాన్‌ల్లో రాకపోకలు సాగిస్తున్నారు. కాగా.. ఆటోలు, వ్యాన్‌ల్లో విద్యార్థులను పరిమితికి మించి ఎక్కించడంతో ప్రమాదపు అంచున ప్రయాణాలు సాగుతున్నాయి. ఆటోడ్రైవర్లు అతివేగంతో వాహనాలు నడపడంతో విద్యార్థుల ప్రాణాలు గాలిలో దీపంలా మారాయి. ధరూర్‌, మోమిన్‌ పెట్‌, , సిద్ధులూరు, నాగారం, మన్నెగూడ ,నవాబ్‌ పేట్‌ ,ఇతర ప్రాంతాల నుంచి వచ్చే చిన్నారులను ఆటోల్లో కుక్కి మరీ తీసుకువస్తున్నారు. కొంతమంది డ్రైవర్లు సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ.. వాహనాన్ని నడుపుతున్నారు. మరికొందరు లౌడ్‌స్పీకర్ల సౌండ్‌ పెట్టి.. అతివేగంతో ప్రయాణం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చే వాహనాల రాకపోకలు గమనించకపోవడంతో ప్రమాదా లు చోటుచేసుకుంటున్నాయి. విద్యా కేంద్రంగా పేరొందిన వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో విద్యార్థుల ప్రయాణాలు భయాందోళన కల్గిస్తున్నాయి. గ్రామం ల నుండి విద్యార్థులు వచ్చిన అదే పరిస్థితి. కొంతమంది విద్యార్థులు ఆటో ముందు భాగంతో పాటు వెనుక భాగంలో కూర్చొని ఇటుపక్క అటుపక్క నిలబడి రాకపోకలు సాగిస్తుండడంతో ఆందోళన కల్గిస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిమితికి మించి, నిబంధనలు పాటించని వాహనాల డ్రైవర్లపై, ప్రైవేట్‌ వాహనాల యజమానులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు