Friday, May 17, 2024

కబ్జాకోర్లు కావాలా..ప్రశ్నించే గొంతుక కావాలా?

తప్పక చదవండి
  • రెండుసార్లు ఒడించారు.. అవకాశమివ్వండి..!
  • కరీంనగర్ కు రక్షణ కవచంగా మారతా
  • నిరంతరం మీకోసమే కొట్లాడుతున్నా
  • నాకు మోడీ ఆశీస్సులున్నాయ్… మీ వెనక నేనున్నా
  • రాష్ట్రమంతా మీ తీర్పు కోసం ఎదురు చూస్తోంది..
  • కరీంనగర్ లో బండి సంజయ్ భావోద్వేగ ప్రసంగం

కరీంనగర్ : ‘‘పేదల కోసం కష్టపడి పనిచేసిన నాలాంటోళ్లను గెలిపించకపోతే… పేదల కోసం ఎందుకు కొట్లాడాలని నా కార్యకర్తలు ప్రశ్నిస్తే నేనేం సమాధానం చెప్పాలే… నా భార్యపిల్లలను చంపుతామన్న భయపడకుండా ధర్మం కోసం, ప్రజల కోసం ఇన్నాళ్లు పోరాడిన… నాకు ఓట్లేసి గెలిపించకుంటే నా భార్యాపిల్లలు ప్రశ్నిస్తే ఏమని చెప్పాలి. కరీంనగర్ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రంలోని అన్ని వర్గాలు మీ తీర్పు కోసం ఎదురు చూస్తున్నయ్. ఒక్క ఛాన్స్ ఇస్తే 5 ఏండ్లు మీకు సేవ చేసుకుంటా. కరీంనగర్ కు రక్షణ కవచంగా నిలుస్తా…’’అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ కోరారు. కరీంనగర్ లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో జరిగిన సకల జనుల విజయ సంకల్ప సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కరీంనగర్ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. రాష్ట్రంలోని అన్ని వర్గాలు మీ తీర్పు కోసం ఎదురు చూస్తున్నయ్. ఒక్క ఛాన్స్ ఇస్తే 5 ఏండ్లు మీకు సేవ చేసుకుంటానన్నారు బండి సంజయ్. కరీంనగర్ కు రక్షణ కవచంగా నిలుస్తానన్నారు. తాను ఓ సామాన్య కార్యకర్తనని.. . నమ్మిన సిద్దాంతం కోసం, కమల వికాసం కోసం కరీంనగర్ లో బీజేపీ కార్యక్రమాల పోస్టర్లను గోడలకు అంటించానని గుర్తు చేశారు. జాతీయ, రాష్ట్ర నాయకులొస్తే.. స్వాగతం పలకడానికి, కార్యక్రమాలు నిర్వహించేందుకు కరీంనగర్ లో పార్టీ జెండాలు కట్టిన సామాన్య కార్యకర్త అన్నారు. ప్రజలు పెంచి పోషించిన కార్యకర్త బండి సంజయ్ అని తెలిపారు. ఆరోజు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గా గెలిపిస్తే..ఈనాడు మీ అందరి ఓట్లతో ఎంపీగా గెలిచినానన్నారు. తాను ఏనాడూ తన తండ్రి పేరు చెప్పి రాజకీయాల్లోకి రాలేదన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం, సమాజాన్ని సంఘటితం చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానన్నారు. రాష్ట్రంలో 9 వేల కోట్ల నిధులు తీసుకొచ్చానన్నారు. అందరూ వ్యాక్సిన్ తీసుకున్నారు కదా…. ఎవరిచ్చారు? బియ్యం ఎవరిచ్చారు? కరీంనగర్ అభివ్రుద్ధికి రూ.9 వేల కోట్లు ఇచ్చిందెవరు? స్మార్ట్ సిటీ నిధులు, గ్రామీణ సడక్ యోజన నిధులు, జాతీయ రహదారులిచ్చిందెవరు? ఈ దేశ అభివ్రుద్దికి నిధులిచ్చిందెవరు…. అలాంటి మహనీయుడికి నిలబడి చప్పట్లతో స్వాగతం పలకాలన్నారు. ఏరోజైతే మీరు నన్ను ఎంపీగా గెలిపించారో ఆరోజు నుంచి నిరంతరం కోట్లాడానన్నారు. ఏనాడూ నా సంపాదన, కుటుంబం గురించి ఆలోచించలేదన్నారు బండి. తన మీద ఆరోపణలు చేసిన నాయకులు.. తాను అవినీతికి పాల్పడ్డట్లు రుజువు చేస్తే తన ఆస్తి మొత్తం కరీంనగర్ అసెంబ్లీ ప్రజలకు రాసిస్తా అంటూ సవాల్ చేశారు. తనపై ప్రధాని మోదీ ఆశీర్వాదం ఉందన్నారు. తనకు ఏ కష్టమొచ్చినా ఇబ్బంది వచ్చినా మోదీ తన వెనుక ఉన్నారన్నారు. తన భుజం తట్టి ప్రోత్సహించారన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ నాశనం చేసాడన్నారు. డబుల్ బెడ్రూం పేరుతో, ఉద్యోగాల పేరుతో అందరినీ మోసం చేశాడని విమర్శించారు. 6 లక్షల అప్పుల పాల్జేశారన్నారు. ఏ విధంగా కేసీఆర్ మళ్లీ వాటిని పూడుస్తారని ప్రశ్నించారు. ఇటు కాంగ్రెస్ ఎట్లా అభివ్రుద్ధి చేస్తుంది? ఎట్లా జీతాలు ఇస్తుంది? అందుకే బీజేపీతోనే అభివ్రుద్ది సాధ్యం. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అప్పులు తీరి సుస్థిర పాలనతో అభివ్రుద్ది చేయడం సాధ్యంమన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు