Tuesday, May 7, 2024

మరో ఐదేళ్ల పాటు ఉచిత రేషన్‌

తప్పక చదవండి
  • 81 కోట్ల మంది ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌
  • స్వయం సహాయక బృందాలకు డ్రోన్లు
  • కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడిరచిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన పథకంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 81 కోట్ల మంది పేద ప్రజలకు 5 కేజీల చొప్పున ఉచితంగా రేషన్‌ ఇచ్చే ఈ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. 2024 జనవరి 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. పీఎంజీకేఏవై కింద అంత్యోదయ అన్నయోజన హౌస్‌హోల్డ్స్‌, ప్రియారిటీ హౌస్‌ హోల్డ్స్‌ లబ్ధిదారులకు ఏడాది పాటు ఉచితంగా ఆహారధాన్యాలు అందించే ఈ పథకం 2023 జనవరి 1 న ప్రారంభించారు. కాగా, పీఎంజీకేఏవై పథకం పొడిగింపుపై ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వివరించారు. పేదరికపు రేఖకు ఎగువకు చేరిన వారి సంఖ్య గత ఐదేళ్లలో 13.50 కోట్లకు పెరిగిందని చెప్పారు. ఇది మోదీ ప్రభుత్వం సాధించిన ఘనతగా చెప్పారు. కోవిడ్‌ మహమ్మారి సమయంలో ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన ప్రవేశపెట్టారని, దీనిని 2024 జనవరి 1 నుంచి ఐదేళ్ల పాటు ఈ పథకాన్ని పొడిగించాలని నిర్ణయించారని తెలిపారు. గత ఏడాది డిసెంబర్‌లో పీఎంజీకేఏవైని జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ)తో విలీనం చేయాలని కేంద్రం నిర్మయం తీసుకుంది. ఎన్‌ఎఫ్‌సీఏ కింద 75 శాతం గ్రావిూణ జనాభా, 50 శాతం పట్టణ జనాభాను ఏఏవై, పీహెచ్‌హెచ్‌ అనే రెండు కేటగిరిల్లోకి తెచ్చారు. ఆగస్టు 15న ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని ప్రకటించినట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో శాస్త్ర సాంకేతిక విజ్ఞాన ప్రయోజనాలను విస్తరించడమే లక్ష్యంగా మహిళా సంఘాలకు డ్రోన్లు అందజేయబోతున్నట్లు తెలిపారు. 2024-25 నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు డ్రోన్ల అందజేస్తామని వెల్లడిరచారు. ఈ పథకం కోసం రూ.1,261 కోట్లు కేటాయించనున్నట్లు మంత్రి వెల్లడిరచారు. అలాగే 81 కోట్ల మంది పేద ప్రజలకు 5 కేజీల చొప్పున ఉచితంగా రేషన్‌ ఇచ్చే పీఎంజీకేఏవై పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం కింద అంత్యోదయ అన్న యోజన హౌస్‌ హోల్డ్స్‌, ప్రియారిటీ హౌస్‌ హోల్ట్స్‌ లబ్దిదారులకు ఏడాది పాటు ఉచితంగా ఆహారధాన్యాలు అందజేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు