Tuesday, October 15, 2024
spot_img

స్థిరంగా గరిష్ట వడ్డీరేట్లు..

తప్పక చదవండి

ఆర్బీఐ గవర్నర్‌ ఏమన్నారంటే..?!

వడ్డీరేట్ల కొనసాగింపుపై ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. 2022 మే నుంచి ఇప్పటి వరకూ పలు దఫాలుగా ఆర్బీఐ పెంచిన రెపోరేట్‌ 6.50 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా వాణిజ్య బ్యాంకులు వడ్డీరేట్లు గరిష్ట స్థాయికి పెరిగాయి. గరిష్ట స్థాయిలో కొనసాగుతున్న వడ్డీరేట్లు ఎంత కాలం కొనసాగుతాయో తానేం చెప్పలేనని, కాలమే దానికి జవాబు చెబుతుందని ఢల్లీిలో శుక్రవారం జరిగిన ఓ సదస్సులో చెప్పారు. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన తర్వాత 2022 ఏప్రిల్‌ నాటికి రిటైల్‌ ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలో పెరిగిపోవడంతో ఆర్బీఐ సహా వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు వడ్డీరేట్లు పెంచాయి. దీనికి తోడు ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం, ఇతర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగడంతో వడ్డీరేట్ల పెంపు కొనసాగుతున్నది. ఆర్బీఐ గతేడాది మే నుంచి పలు దఫాలుగా 250 బేసిక్‌ పాయింట్లు పెంచడంతో రెపోరేట్‌ 6.50 శాతానికి చేరింది. ఈ రెపోరేట్‌, వాణిజ్య బ్యాంకుల గరిష్ట వడ్డీరేట్లు ఎంత కాలం స్థిరంగా కొనసాగుతాయో చెప్పలేమని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం, అస్థిరత వంటి సమస్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వెంటాడుతున్నాయని శక్తికాంత దాస్‌ చెప్పారు. మరోవైపు ముడి చమురు ధరతోపాటు ప్రభుత్వ బాండ్లపై రాబడి పెరుగుదల వంటి సవాళ్లు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందికరంగా మారాయన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ గ్రోత్‌ 6.5 శాతంగా నమోదు కావచ్చునని అంచనా వేశారు. రూ.10 వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు వెనక్కు తిరిగి రావాలని చెప్పారు. ప్రస్తుతం దేశంలోని 19 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో ఈ నోట్ల మార్పిడి ప్రక్రియ కొనసాగుతున్నది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు