Monday, April 29, 2024

చైనాలో కొత్త వైరస్ భయాలు..?

తప్పక చదవండి
  • ఉత్తర చైనాలోని పిల్లలకు కొత్తరకం న్యూమోనియా
  • ఆస్పత్రుల్లో భారీగా చేరుతున్న బాధితులు
  • బాధితుల్లో కరోనా వైరస్ మాదిరి లక్షణాలు
  • ఎలాంటి పరిస్థితి ఎదుర్కొడానికైనా సిద్ధమైన భారత్

పిల్లలలో శ్వాసకోశ వ్యాధులు, న్యుమోనియా కేసుల పెరుగుదలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ఓ) అధికారికంగా చైనా నుండి నివేదిక కోరింది. బీజింగ్ తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న నగరాల్లో న్యుమోనియో వ్యాప్తి చెందుతుంది. దీంతో దేశంలోని పలు ఆసుపత్రుల్లో అనారోగ్యంతో చేరుతున్న పిల్లల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది.ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చైనాను ఈ విషయమై పూర్తిస్థాయి నివేదిక కోరింది. ఈ నెల 23న నేషనల్ హెల్త్ కమిషన్ చైనాలోని పిల్లల్లో శ్వాసకోశ వ్యాధుల పెరుగుదలను గుర్తించినట్టుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో పొరుగున ఉన్న భారత్ కూడా అప్రమత్తమైంది. H9N2 (ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్) కేసులు, శ్వాసకోశ వ్యాధుల వ్యాప్తి నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అక్కడ వ్యాప్తిచెందుతున్న ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా కేసుల నుంచి భారతదేశానికి ముప్పు తక్కువగా ఉందని పేర్కొంది. ‘ప్రస్తుత పరిస్థితుల నుంచి ఉద్భవించే ఎలాంటి అత్యవసర పరిస్థితికైనా భారతదేశం సిద్ధంగా ఉంది’ అని ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘పిల్లలలో శ్వాసకోశ అనారోగ్యానికి సాధారణ కారణాలేనని, అసాధారణమైన వ్యాధికారక లేదా ఏదైనా ఊహించని క్లినికల్ కారణాలు గుర్తించలేదు’ అని తెలిపింది. ‘ఇప్పటి వరకూ డబ్ల్యూహెచ్ఓ ప్రమాద నివేదిక అంచనా ప్రకారం H9N2 మనిషి నుంచి మనిషికి వ్యాప్తి చెందే ముప్పు, మరణాల రేటు తక్కువ సూచిస్తుంది. మానవ, పశుసంవర్ధక, వన్యప్రాణుల విభాగాల మధ్య పర్యవేక్షణను బలోపేతం చేయడం, సమన్వయాన్ని మెరుగుపరచడం అవసరం అని గుర్తించింది. భారతదేశం ఎలాంటి ప్రజారోగ్య అవసరానికైనా సిద్ధంగా ఉంది’ అని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఆరోగ్య సమస్యల పరిష్కారానికి సమగ్రమైన రోడ్‌మ్యాప్‌ను అనుసరించే వన్ హెల్త్ విధానాన్ని భారత్ ప్రారంభిస్తోందని ప్రకటనలో పేర్కొంది. ‘ప్రత్యేకించి కోవిడ్ మహమ్మారి నుంచి ఆరోగ్య మౌలిక సదుపాయాలలో గణనీయమైన మార్పు వచ్చింది.. ప్రధాన మంత్రి-ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ ప్రాథమిక, ద్వితీయ, తృతీయ అన్ని స్థాయిలలో నిరంతరాయంగా ప్రస్తుత, భవిష్యత్ మహమ్మారి లేదా విపత్తులకు సమర్థవంతంగా ప్రతిస్పందించడానికి ఆరోగ్య వ్యవస్థలు, సంస్థల సామర్థ్యాలను అభివృద్ధి చేస్తోంది’ అని తెలిపింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు