Thursday, May 9, 2024

ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వైఎస్‌ఆర్‌ గార్డెన్‌ యాజమాన్యం

తప్పక చదవండి

సరూర్‌ నగర్‌ : ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ యాజమాన్యం ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుని ఉన్నారు. గతంలో మీరు 2011 కలెక్టర్‌ కి చెప్పినారు. అపుడు ప్రభుత్వం వారు ప్రభుత్వ స్థలం అని బోర్డ్‌ ఏర్పాటు చేశారు. తదుపరి 2015 లో ఉన్న ఎమ్మెల్యే కూడా కలెక్టర్‌కి చెప్పేవారు. అప్పటినుండి ఇప్పటి వరకు ఏ అధికారి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని భారాస మాజీ డివిజన్‌ ప్రెసిడెంట్‌ కందికంటి శ్రీధర్‌ గౌడ్‌ మంగళవారం ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డికి, సరూర్‌ నగర్‌ మండల తహసీల్దార్‌ కే. కృష్ణ కి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం వైఎస్‌ఆర్‌ గార్డెన్‌ వారు 10 ఎకరాల భూమి డెవలప్మెంట్‌ కోసం మార్కెట్లో పెట్టినారు. వారికి రికార్డ్‌ పరంగా 6 ఎకరాల చిల్లర స్థలం ఉన్నది. వాళ్ళు సర్వే నం 86 లో ఉన్న 1 ఎకరా 20 గుంటలు జీవో 69 కింద రెగ్యులరైజషన్‌ కోసం పెట్టుకున్నారు. దానిని వెంటనే ఆపించి ప్రభుత్వం వారిచే సర్వే నిర్వ హించి ప్రహరీ గోడను నిర్మింప చేయించగలరని కోరుచున్నాము. అలాగే మొత్తం వైఎస్సార్‌ గార్డెన్‌ వారి స్థలం రికార్డ్‌ పరంగా ఎంత ఉన్నదో చూసి అక్కడ ఉన్న స్థలం సర్వే చేయించినచో 3 ఎకరా చిల్లర మిగులవచ్చు. మిగిలిన స్థలం మొత్తం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవలసిందిగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కి సమాచారం జారీ చేయవలసిందని సరూర్‌ నగర్‌ తహసీల్దార్‌ కు వినతిపత్రం అందజేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు