Sunday, May 12, 2024

ప్రపంచకప్‌ మ్యాచ్‌లో ఓటమిగా నిలుచున్నా ఇంగ్లండ్‌ క్రికెట్‌ టీమ్‌..!

తప్పక చదవండి

హైదరాబాద్‌ : ఆదివారం అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన ప్రపంచకప్‌ మ్యాచ్‌లో ఓటమి అనంతరం ఈ చెత్త రికార్డు ఇంగ్లండ్‌ పేరిట నమోదైంది. అఫ్ఘాన్‌తో ఓటమితో టెస్టు క్రికెట్‌ ఆడే అన్ని జట్ల చేతిలో వన్‌ డే ప్రపంచకప్‌లో ఓటమిని ఎదుర్కొన్న తొలి జట్టుగా ఇంగ్లండ్‌ బ్యాడ్‌ ఇమేజ్‌ సంపాదించుకుంది. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఇంగ్లండ్‌ టీమ్‌ ఆస్ట్రేలియా చేతిలో తొలి ఓటమిని ఎదుర్కొంది. 1975లో జరిగిన మొదటి ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఇక 1979లో జరిగిన రెండో ప్రపంచకప్‌ ఫైనల్‌లో వెస్టిండీస్‌ చేతిలో ఇంగ్లండ్‌ ఓటమిపాలైంది. ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్‌కు అదే తొలి ఓటమి. తర్వాత 1983 ప్రపంచకప్‌లో ఇండియా‌, న్యూజిలాండ్‌ జట్లు ఇంగ్లండ్‌ను ఓడించాయి. ప్రపంచకప్‌లో ఆ రెండు జట్లకు ఇంగ్లండ్‌పై అవే తొలి విజయాలు. అదేవిధంగా 1987 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ చేతిలో ఇంగ్లండ్‌ ఓడింది. ప్రపంచకప్‌ చరిత్రలో పాక్‌పై ఇంగ్లండ్‌కు అదే తొలి ఓటమి. ఆ తర్వాత 1992 ప్రపంచకప్‌లో ఎవరూ ఊహించని విధంగా జింబాబ్వే చేతిలో ఇంగ్లండ్‌ ఓడిపోయింది. ఇక 1996 ప్రపంచకప్‌లో శ్రీలంక, దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్‌ను ఓడించాయి. ప్రపంచకప్‌ టోర్నీలో ఇంగ్లండ్‌ను ఓడించడం ఆ రెండు జట్లకు అదే తొలిసారి. ఆ తర్వాత 2011 ప్రపంచకప్‌లో చిన్న జట్లు అయిన బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌ కూడా ఇంగ్లండ్‌పై విజయం సాధించాయి. ఇక ప్రస్తుతం ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ పసికూన అఫ్ఘానిస్థాన్‌ చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దాంతో ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఇంగ్లండ్‌తోపాటు టెస్టు క్రికెట్‌ ఆడే మొత్తం 11 జట్ల చేతిలో ఆ టీమ్ వన్‌ డే ప్రపంచకప్‌ మ్యాచ్‌లలో ఓడినట్లయ్యింది. ఈ విధంగా మరే జట్టు మూటగట్టుకోని చెత్త రికార్డును ఇంగ్లండ్‌ సొంతం చేసుకుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు