Sunday, April 28, 2024

క్లాస్ హీరోగా మాస్ హీరోగా సన్నీ కునాల్ కు మంచి భవిష్యత్తు ఉంది..

తప్పక చదవండి
  • కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి.

తాతలోని సుగుణాన్ని, తండ్రిలోని సాహితీ సంపదను.. తన కెరీర్ కు మార్గగామిగా మలుచుకున్న యువహీరో.. వరుసగా సినిమాలు అందిపుచ్చుకుంటున్న హీరో సన్నీ కునాల్ కు.. మాస్ హీరోగా, క్లాస్ హీరోగా మంచి ఫ్యూచర్ ఉంది అని కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాల చారి అన్నారు. సన్నీ కునాల్ హీరోగా నటించిన తాంత్రికుడు సినిమా ట్రైలర్ రిలీజై మంచి స్పందన వస్తున్న సందర్భంగా
తెలంగాణ ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్, సముద్రాల వేణుగోపాల చారి మాట్లాడుతూ….

“చూడగానే క్యూట్ గా ఆకట్టుకునే రూపంతో ఉన్న హీరో సన్నీ కునాల్ లో మరో యాంగిల్ ఉంది. కునాల్ చేసిన ఫైట్స్ చూశాక ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి యంగ్ అండ్ డైనమిక్ యాక్షన్ హీరో దొరికాడనిపించింది. అదే విధంగా హీరోయిన్లు అనూష, త్రివేణిల నటన బాగుంది. హీరో హీరోయిన్లపై గోవాలో చిత్రీకరించిన పాటలో సంగీతము, సాహిత్యము, దృశ్యము అన్ని సమపాళ్లల్లో కుదిరాయి. పాట చాలా బాగుంది. తాంత్రికడు టైటిల్ రోల్ లో నటించిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ మహేంద్ర వడ్లపట్ల మంచి ప్రాజెక్టు డిజైనర్. ప్రతిభావంతుడు
మహేందర్ కు అభినందనలు.

- Advertisement -

ఈ సినిమా కోసం తన శక్తి యుక్తులు దారపోసిన ఆల్ రౌండర్ ఎస్. కుమారస్వామికి నా ప్రత్యేక శుభాకాంక్షలు. తెర వెనక అలాంటి వ్యక్తులు ఉంటేనే తెరపై మనం సినిమాలు చూడగలుగుతాము. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికి సినీ కళామతల్లి ఆశీస్సులు ఉంటాయి. ఈ సినిమా ఆర్థికంగా విజయం సాధించి మా మహేందర్ మరిన్ని సినిమాలు తీయాలి.” అని ఆకాంక్షించారు..

హీరో సన్నీ కునాల్ మాట్లాడుతూ… ” అందరిలో ఏదో ఒక ప్రతిభ ఉంటుంది అయితే కొందరికే భగవంతుని ఆశీర్వాదాలు ఉంటాయి. నేను వరుసగా సినిమాలు చేయడానికి కారణం కుమార స్వామి.. ఆయనను పరిచయం చేసిన వివ రెడ్డి.. ఈ ఇద్దరు నాకు జీవితాంతం గుర్తుండిపోతారు. నాలో ఉన్న టాలెంట్ ను గుర్తించి నన్ను ఆశీర్వదించిన ఇద్దరికీ నేను రుణపడి ఉంటాను. ప్రేక్షకులను మెప్పించడానికి నా శక్తివంచన లేకుండా ప్రయత్నం చేశాను. గోవాలో తీసిన పాటలు, ఫారెస్ట్ లో తీసిన ఫైట్లు అద్భుతంగా ఉంటాయి. ఖర్చుకు వెనకాడకుండా సినిమా కోసం భారీ పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్ మహేంద్ర వడ్లపట్ల గారి గట్స్ కు హాట్సాఫ్.

ఈ సినిమాలో నాతో పాటు నటించిన రాజేష్, హీరోయిన్లు అనూష, త్రివేణి అందరికీ ఈ సినిమా మంచి పేరు తీసుకువచ్చి మరిన్ని అవకాశాలు వచ్చేలా ప్రేక్షకులు ఆశీర్వదించాలి. నన్ను హీరోగా గుర్తించి నాపై నమ్మకంతో సినిమాలు తీస్తున్న నిర్మాతలకు నేను వినయంగా, నమ్మకంగా పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. సినిమాలో పనిచేసిన వారికే కాకుండా వారి కుటుంబ సభ్యుల ఆకలి తీరుస్తున్న ప్రొడ్యూసర్ నిజంగా దేవుడు. ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు.. సినిమా లేకపోతే ఎంతోమంది ప్రతిభావంతులు పస్తులతో పడుకుంటారు. ఆ పరిస్థితి ఇండస్ట్రీకి రాకూడదని మనసా వాచా కర్మణా భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. భగవంతుడు ఆశీర్వదిస్తే ఇండస్ట్రీలో ప్రతిభావంతుల కోసం ఒక ట్రస్ట్ పెట్టాలని వారి ఆకలి దప్పులు తీర్చాలని సంకల్పం చేసుకుంటున్నాను.” అని అన్నారు.

ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్ మహేందర్ వడ్లపట్ల మాట్లాడుతూ… “ఈ సినిమా కోసం మూడు నెలలు ఇండియాకు వచ్చాను. మళ్లీ మూడు నెలల తర్వాత ఇండియాకు వచ్చి కొత్త సినిమా స్టార్ట్ చేస్తాను.” అని అన్నారు. త్వరలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సమర్పణ : సౌమ్య వడ్లపట్ల. సంగీతం : ఆనంద్. కె.. కెమెరా : వంశీ.. ఎడిటర్ : మూత దేవేందర్.. కో ప్రొడ్యూసర్ : బబిత కాంబ్లె, పీ.ఆర్.ఓ. : మూర్తి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు