Wednesday, February 28, 2024

చెయ్యికే ఓటు…కాంగ్రెస్ పార్టీకే మా స‌పోర్టు

తప్పక చదవండి
  • మహిళా శక్తితో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం
  • ఉప్పల్ లో కాంగ్రెస్ పార్టీకి మహిళల అండ…
  • మహిళా ఓటర్లు ను కట్టుకుంటున్న రజిత పరమేశ్వర్ రెడ్డి….
  • ఆరు గ్యారెంటీ లే కొండంత అండ…..
  • పరమేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థన

హైదరాబాద్( ఆదాబ్ హైదరాబాద్) : ఉప్పల్ నియోజకవర్గంలో మహిళా శక్తితో కాంగ్రెస్ అభ్యర్థి మందమల్ల పరమేశ్వర్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని రజిత పరమేశ్వర్ రెడ్డి కాప్రా సర్కిల్ లోని కాప్రా, ఏఎస్ రావు నగర్, చర్లపల్లి, మీర్ పేట హౌసింగ్ బోర్డ్ కాలనీ, మల్లాపూర్ డివిజన్ లో భారీ సంఖ్యలో మహిళలతో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఉప్పల్, చిలకనగర్, రామంతపూర్, హబ్సిగూడ డివిజన్ కాలనీలో నాయకులు కార్యకర్తలతో ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మహిళలు అండగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యంగా మహిళా సాధికారితే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో తయారు చేసిందని గుర్తు చేశారు. ఉప్పల్ నియోజకవర్గంలో మహిళల దీవెనలతో భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గ పరిధిలో ప్రచారాన్ని నిర్వహిస్తుంటే ప్రజలే స్వచ్ఛందంగా కాంగ్రెస్ ను గెలిపించుకుంటామని భరోసానిస్తున్నారని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పై ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని ఈసారి కాంగ్రెస్ కే అవకాశాలు ఇస్తామని ప్రజలే భరోసానిస్తున్నారని పేర్కొన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలు, యువత రక్షణ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు