Sunday, April 28, 2024

అక్రమ నిర్మాణాల కూల్చివేత

తప్పక చదవండి
  • ఆదాబ్‌ కథనానికి స్పందన

కీసర : చీర్యాల్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్‌ 333, 336 లలో గల అక్రమ నిర్మాణాలపై ఆదాబ్‌ హైదరాబాద్‌ దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. చీర్యాల్‌ గ్రామ పంచాయతీ పరిధిలో పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలపై ఆదాబ్‌ హైదరాబాద్‌ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమైన విషయం పాఠకులకు విదితమే. మంగళవారం డిఎల్‌పీవో స్మిత, ఎంపీవో వినూత్న ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అక్రమ నిర్మాణదారులపై ఫిర్యాదు చేస్తూ, క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేసినట్లు పంచాయతీ కార్యదర్శి భాస్కర్‌ తెలిపారు. అనుమతులు తీసుకుని మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు