Monday, May 13, 2024

విద్యార్థులకు ఆరుబయటే భోజనాలు

తప్పక చదవండి
  • హెచ్‌ఎం, వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తచేసిన పీఓ
  • విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి
  • హెచ్‌డబ్బ్యుఓకు షోకాజ్‌ నోటీసు
  • పిల్లల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు : పిఓ ప్రతీక్‌జైన్‌

పాల్వంచ : పాల్వంచలోని గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమపాఠశాలలో విద్యార్థులకు ఆరుబయట భోజనాలు పెట్టడం చూసి ఐటిడిఎ పిఓ ప్రతీక్‌జైన్‌ హెచ్‌ఎం, వార్డెన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం పిఓ ఆశ్రమ పాఠశాలను ఆకస్మీకంగా తనిఖీ చేశారు.ఈసమయంలో విద్యార్థులు భోజనాలు ఆరుబయట చేయడాన్ని చూసి మండిపడి పాఠశాలలో తరగతి గదులు, డార్మెటరీలు, డైనింగ్‌హాల్స్‌ ఉండగా పిల్లలకు ఆరుబయట కూర్చొని భోజనం చేయడంబ ఏంటని ప్రశ్నించారు. అనంతరం పాఠశాల పరిసరాలను, గదులను, డైనింగ్‌ హాల్‌ డార్మెటరీ పరిశీలించారు.అనంతరం పిఓ మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల సౌకర్యార్థం అనేక సౌకర్యాలు కల్పించడం జరిగిందని, సిబ్బంది అశ్రద్ధ వలన పిల్లలకు సరైన వసతి కల్పించలేకపోతున్నారన్నారు. వారి చదువుకోసం అనేక రకాల పుస్తకాలు, అభ్యాసికాలు, నోట్‌బుక్స్‌, సాధన బుక్స్‌ పంపణీ చేయడం జరిగిందని, అయినా వాటిని పిల్లలకు వినియోగించకుడా స్టోర్‌రూంలో పడవేయడం చూసి సంబంధిత హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే డిడి ట్రైబల్‌ వెల్ఫేర్‌ మణ్మెకు ఫోన్‌ ద్వారా తెలియచేస్తూ హెచ్‌డిఓపని తీరుసరిగా లేదని ఆయనకు షక్షకాజ నోటీసు జారీ చేశారు. వర్షాకాలం కావడంతో వాతావరణం సరిగాలేని కారణంగా విద్యార్థులకు పట్ల సంబంధిత హెచ్‌ఎంలు, వార్డెన్లు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం పాఠశాలలో పిల్లలతోపాటు భోజనం చేసి ప్రతి రోజూ మెనూప్రకారం భోజనాలు అందిస్తున్నారా లేదాని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సమస్య వచ్చినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వారం రోజులలో తరగతి గదులు, బాత్‌రూమ్‌లు డైనింగ్‌హాల్‌, డార్మెటరీ, పూర్తిస్థాయిలో రిపేర్‌ చేయించి విద్యార్థులకు బయటకాకుండా లోపల భోజనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దోమలు ప్రబలకుండా కిటికీలకు మెస్‌ వేయించాలని,ప్రతిరోజూదోమలకు సంబంధించిన ఫాగింగ్‌ చేయించాలన్నారు.పిల్లలపట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలతోపాటు అవసరమైతే శాఖాపరమైనచర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బుచ్చిరాములు, డిప్యూటీ వార్డెన్‌ ప్రమోద్‌, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు