Saturday, April 27, 2024

కార్మికుల బ్యాంక్‌ ఖాతాల్లోరూ.1450కోట్లు జమ

తప్పక చదవండి
  • అత్యధిక ఎరియర్స్‌ పొందిన ఉద్యోగులకు చెక్కులు అందచేత
  • నిధులు విడుదల చేసిన డైరెక్టర్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ఎన్‌.బలరామ్‌

కొత్తగూడెం : సింగరేణి కార్మికులకు 11వ వేజ్‌బోర్డు బకాయిలు రూ.1450కోట్లను కార్మికుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశారు. సంస్థఛైర్మన్‌ ఎన్‌.శ్రీధర్‌ ఆదేశం మేరకు డైరెక్టర్‌ ఫైనాన్స్‌ ఎన్‌.బలరామ్‌ హైద్రాబాద్‌లోని సింగరేణి భవన్‌ నుండి ఆన్‌లైన్‌ ద్వారా 39వేల మంది కార్మికుల ఖాతాల్లో ఈఏరియర్స్‌ను గురువారం విడుదల చేశారు.ఈసందర్భంగా జనరల్‌ మేనేజర్‌ కోఆర్డినేషన్‌ ఎం.సురేష్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూసింగరేణి చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ఒకే దఫా ఎరియర్స్‌ మొత్తం చెల్లించడం ఇదే తొలిసారి అన్నారు. తొలుత రెండు దఫాలుగా ఎరియర్స్‌ చెల్లించాలని భావించినప్పటికీ సంస్థఛైర్మన్‌ ఆదేశం మేరకు అనుకున్న సమయానికి కన్నా ముందే ఒకేసారి ఎరియర్స్‌ చెల్లింపుకు సన్నాహాలు పూర్తి చేశామనా ్నరు. 11వ వెజ్‌బోర్డు జీతాలను కూడా సింగరేణి సంస ్థ కోల్‌ఇండియాకన్నా ముందు అమలు జరిపిందని గుర్తు చేశారు. కార్మికులకు చెల్లించే ఎరియర్స్‌లో ఇన్‌కంటాక్స్‌, సిఎంపిఎఫ్‌, పెన్షన్‌కు చెల్లించాల్సి ఉన్న సొమ్మును మినహాయించి మిగిలిన మొత్తాన్ని కార్మికుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రముఖ్యమంత్రి గతంలో ప్రకటించిన 700కోట్ల లాభాల బోనస్‌ను దసరా పండుగకు ముందుగానే చెల్లించడానికి ఏరా ్పట్లు పూర్తి చేశామన్నారు. ఎరియర్స్‌ బోనస్‌ చెల్లింపుల విషయాల్లో కొందరు అనవసర అపోహలు కలిగిస్తున్నారని వీటిని కార్మికులు ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదన్నారు.పెద్దమొత్తంలో ఎరియర్స్‌ పొందిన కార్మికులు ఈసొమ్మును పొదుపుగా వాడుకోవాలని, కుటుంబ భవిష్యత్‌కు సద్వినియోగం చేసుకోవాలన్నారు.అత్యధిక ఎరియర్స్‌ పొందిన లచ్చయ్య(రూ.6,97లక్షలు) రవిబాబు(6.81లక్షలు, సత్యనారాయణరెడ్డి(6.69లక్షలు)లను ఆయనతో పాటు జిఎం కోఆర్డినేషన్‌ ఎం.సురేష్‌ చెక్కులను అందచేశారు.సింగరేణి టాపర్‌గా రూ.9.91లక్షలు పొందిన రామగుండం ఒకటి ఏరియాకు చెందిన వేముల సుదర్శన్‌రెడ్డి నిలిచారు. రెండోస్థానంలో 9.35లక్షలతో రామగుండం2 ఏరియాకి చెందిన ఈ ఇపి ఆపరేటర్‌ఱగా మీర్జాఉస్మాన్‌బేగ్‌ ఉండగా, మూడోస్థానంలో 9.16లక్షలతో శ్రీరాంపూర్‌ ఏరియాలో హెడ్‌ ఓవర్‌మెన్‌గా పనిచేస్తున్న ఆడెపు రాజమల్లు నిలిచారు. అన్ని ఏరియాల్లో అత్యధిక ఎరియర్స్‌ పొందిన ఉద్యోగులను జిఎంలు ఘనంగా సన్మానించి చెక్కులను అందచేశారు. సింగరేణియాజమాన్యం ఒకేసారి ఎరియర్స్‌ చెల్లించడం పట్ల సింగరేణి ఉద్యోగులు తమ సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు ఎన్‌వి.రాజశేఖర్‌రావు, ఎన్‌.భాస్కర్‌ పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు