Thursday, May 9, 2024

సమయపాలనకు తిలోదకాలిచ్చిన దోమ గ్రంథాలయం అధికారి..

తప్పక చదవండి
  • ఈ వార్త పత్రికలో వస్తే.. నువ్వు పత్రికలో ఎలా
    పనిచేస్తావో చూస్తా.. అంటూ బెదిరింపులు..
  • ఉన్నతాధికారుల ఆదేశాలు భే ఖాతర్‌..
  • అడిగితే పొంతనలేని సమాధానాలు ఇస్తున్న వైనం..

పరిగి : ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించాలని నిబంధన ఉన్నా.. అధికారులు ఈ దిశగా ఎన్ని ఆదేశాలు జారీ చేసినా.. క్షేత్రస్థాయిలో వాటికి భిన్నంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. విధి నిర్వహణలో ఉండి కూడా వారు ఆఫీసుకు రాకుండా సొంత పనులు చేసుకుంటున్నారని అక్కడక్కడ గుసగుసలు వినబడుతున్నాయి. వికారాబాద్‌ జిల్లా, దోమ మండల కేంద్రంలోని గ్రంథాలయం అధికారి సమయపాలన పాటించడం లేదని, గ్రంథాలయానికి వచ్చే పాఠకులు, స్థానికులు వాపోతున్నారు. ఇదే విషయమై పాఠకులు, స్థానికులు, గ్రంథాలయం ఉద్యోగి నారాయణను అడగగా.. మా సార్‌ వస్తున్నారని, ఈరోజు లేట్‌ అయిందని సమాచారం ఇచ్చారు. దీంతో దోమ మండల గ్రంథాలయం అధికారి రమేష్‌ ను వివరణ కోరగా.. గ్రంథాలయం ప్రారంభం గురించి మాట్లాడ టానికి ఎమ్మెల్యే దగ్గరికి వచ్చానని చెప్తున్నారు. కావున ఉన్నంత అధికారులు స్పందించి, ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా.. చర్యలు తీసుకోవాలని పాఠకులు, స్థానికులు, సొసైటీ బ్యాంక్‌ డైరెక్టర్‌ వెంకటయ్య తదితరులు కోరుతున్నారు.
జిల్లా అధికారి వివరణ :
దాదాపూర్‌ గ్రామంలో పి ఆర్‌ ఆర్‌ ఓపెన్‌ చేసాము కాబట్టి, ఆ వర్క్‌ పైన దాదాపూర్‌ సర్పంచ్‌ తో మాట్లాడడానికి వెళ్లాడని జిల్లా అధికారి సురేష్‌ వివరణ ఇచ్చాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు