Thursday, May 9, 2024

డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను పంపిణీ చేసినవిద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

తప్పక చదవండి

మహేశ్వరం : మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మన్సాన్‌ పల్లిలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పంపిణీ, కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. జడ్పీ చైర్‌ పర్సన్‌ అనిత రెడ్డి,ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి,దయనంద్‌ గుప్తా,యెగ్గే మల్లేశం,కలెక్టర్‌ హరీష్‌ తో కలిసి లక్కీ డ్రా ద్వారా డబుల్‌ బెడ్‌ రూమ్‌ లు పొందిన వారికి సంబంధిత పత్రాలు, తాళాలు అందించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి.ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ…లక్ష డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను 9700 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించాం అన్నారు.ఎవరికి ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులకు ఉచితంగా అత్యంత పారదర్శకంగా ఎంపిక చేసాం.మానవ రహితంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆన్లైన్‌ ప్రక్రియ ద్వారా పూర్తి పారదర్శకంగా పార్టీలు,కుల, మతాలక తీతంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టడం జరిగింది.గూడు లేని పేదలను పక్కాగా గుర్తించి డ్రా కు ఎంపిక చేసినట్లు తెలిపారు.ప్రతిపక్షాలు వారు పాలిస్తున్న రాష్టాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకున్న,దేశానికే ఆదర్శంగా తెలంగాణ నిలుస్తుండటంతో ఉనికి కోల్పోతున్నామని, ప్రజల్లో అపోహలు సృష్టిస్తూన్నారని మంత్రి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గములోని పలు గ్రామాల్లో ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నట్లు,అదేవిధంగా జాగ ఉన్న వారికి ఇల్లు కట్టుకోవటానికి 3 లక్షలు గృహ లక్ష్మీ పథకం కింద మంజూరు చేస్తామన్నారు.పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, కేసీఆర్‌ వెన్నంటే ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ లు యంపిటీసీ లు వైస్‌ యంపీపీ బి ఆర్‌ ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు