Wednesday, May 8, 2024

కరోనా కష్టాలు… పరిపాలన పాఠాలు

తప్పక చదవండి

ప్రపంచాన్నిగడగడలాడిరచిన కరోనా వైరస్‌ మరోసారి జే.ఎన్‌1 వేరియంట్‌ రూపములో మన దేశంలో అలాగే మన రాష్ట్రములో కూడా వ్యాపించింది. ఇది రోజు రోజుకు మరింతగా విస్తరించే అవకాశం ఉన్నది. ఇక చాలామంది వైద్యశాస్త్రవేత్తలు, ఆర్థిక వేత్తలు చెప్పినట్టు ఇది ప్రజా-జీవితంలో అంతర్భాగంకా నుంది. మరీ ఇటువంటి ఆవశ్యక సందర్భంలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేల సమర్థ వంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కరోనా వ్యాధి చెలగాటం వలస సామాన్య ప్రజల పాలిట ప్రాణ సంకటంలా మారింది. ఇలాంటి పరిస్థితిలో ఇకనుండైనా కేంద్ర ప్రభుత్వం దీన్ని పకడ్బందీగా కట్టడి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయ సహాకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంలో కరోనా కట్టడిని సమర్థవంతంగా అమలు చేయ డంలో వేరే దేశాలు, రాష్ట్రాలు తీసుకున్న చర్యలను ఆదర్శంగా తీసుకోవాలి. మొట్టమొదటి సారి కరోనా వైరస్‌ కేరళలో వ్యాపిం చిన ప్పుడు ఆరోజు నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా పకడ్బం దీగా, సమర్థవంతంగా వ్యవహారిస్తూ వైరస్‌ వ్యాప్తి తీవ్రతరం కాకుండా ప్రయత్నం చేసింది. అందులో సఫలీకృతం అయింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల ముందున్నాబాధ్యత ఏమిటంటే కరోనా వ్యాప్తి జే.ఎన్‌1 వేరియంట్‌ నియంత్రణతో పాటు ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు కలిగించేలా ఆర్థిక ఉద్దీపన కార్యక్రమాలు ప్రోత్సహి స్తూ ప్రజల కష్టాలను తీర్చేలా కృషి చేయాలి. ఈ విధానంలో కేరళ ప్రభుత్వం మొదటిసారిగా ఇరవై వేలకోట్ల ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీతో ముందుకు రావడం వలన రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి ఎటువంటి ఆకలి బాధలు లేకుండా, వలస కార్మికు ల బాగోగులను చూసుకున్నారు. ప్రత్యేక సందర్భంలో ప్రజలకు కావాల్సిన అత్యవసర వస్తువులను, సరకులను ప్రత్య క్షంగా ఇంటికే పంపిణీ చేయడం జరిగింది. మరొకవైపు ప్రభుత్వ అధీనం లో ఉన్న ఆసుపత్రుల స్థాయిని పెంచుతూ కరోనా పరిక్షల ని విస్తృతంగా చేస్తూఐసోలేషన్‌ వార్డులను పెంచుకుంటూ పోయారు. దీని వలన కొత్తగా వైరస్‌ సోకిన వారిని గుర్తించి సరైన సమయ ములోపరీక్షించడం వలన కేరళలో వైరస్‌ వ్యాప్తి చాలావరకు తగ్గుముఖం పట్టింది. కరోనా పరీక్షలను విస్తృతంగా చేస్తూ ఆసు పత్రుల స్థాయిని పెంచుకుంటూ నియమ నిబంధనలను సమర్థ వంతంగా కఠినంగా అమలు చేయడం వలన వ్యాధి నిర్వహణ సాధ్యపడుతుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే మొదట్లో కాస్త తక్కువ కేసులు నమోదు అయినప్పటికీ తర్వాత తర్వాత పాజిటివ్‌ కేసులు సంఖ్య ఎక్కువ కావడంతో కఠినమైన నియమ నిబంధనలు అమలు చేయడం చాలా అవసరం. అయితే ఈ నియమ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం ఎంత శ్రద్ధగా అమలు చేస్తుందో అంతే శ్రద్ధగా కరోనా పరీక్షలను జరపాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రుల సామర్థ్యాలను పరీక్ష కేంద్రాలను పెంచు కుంటూ గ్రామస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పిస్తూ ప్రజలను స్వచ్ఛందంగా పరీక్ష చేయించుకోవాల్సిందిగా ప్రోత్సహిం చాలి. చాలామంది భయంతో అవగాహన లేమితో పరీక్ష కేంద్రా లకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండటం వల్ల కొద్దిరోజులకు ఈ వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా అయ్యింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇక నుంచి అయినా పట్టణ, గ్రామస్థాయిలో కూడా విస్తృతంగా పరీక్ష లను నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా తెలం గాణ రాష్ట్రంలో వివిధ రాష్ట్రాల నుండి పొట్టకూటికి వచ్చిన వలస కార్మికులు చాలామంది ఉన్నారు. వారికి సరైన వైద్య పరీక్షలని నిర్వహిస్తూ, వేరే రాష్ట్రాల నుండి వచ్చిన వలస కార్మికులకు అవ సరమైన సౌకర్యాలను కల్పించాలి. మొదటి సారి కరోనా వచ్చిన ప్పుడు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఎక్కువ రోజు లైనా లాక్‌ డౌన్‌ మనదేశములో విధించడం జరిగింది. అయినా కూడా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య లక్షలకు పైగా నమోద య్యాయి. ఇంకా లక్షల మంది మరణించారు. నిజానికి ఇన్ని రోజుల లాక్‌ డౌన్‌లో ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లకు చాలా సమయం దొరికింది. వ్యాధి విస్తృతంగా వ్యాప్తి అవ్వ కుండా చర్యలు తీసుకునేలా కూడా సమయం దొరికింది. అయితే భారత దేశ జనాభా నూట ముప్పయి కోట్లు దానికితోడు సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, సమాజంలో ఆర్థిక సామాజిక అసమానతలు, ఈ వ్యాప్తి కట్టడికి అవరోధాలుగా ఉన్నవి. అయితే దేశ జనాభాలో 60 శాతానికి పైగా యువత/ యువకులు ఉండ డం మంచి పరిణామంగానే భావించాలి. అయినప్పటికీ వీటిని ఉపయోగ సాధనాలుగా చేసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థ వంతమైన చర్యలతో వైరస్‌ ను నియంత్రించేలా పూనుకోవాలి. ఈ వైరస్‌ వ్యాప్తికి తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలు అలాగే వైరస్‌ బారిన పడిన వారికి కల్పిం చాల్సిన వైద్య సేవలు వివిధ రాష్ట్రాలలో భిన్నంగా ఉన్నాయి.. దీని ప్రకారం ఆయా రాష్ట్రాలు ఆ వ్యాధి వ్యాప్తి ప్రకారం అడ్డుకునేల నియంత్రణ కార్యక్రమాలను అమలు చేయాలి. ఈ వైరస్‌ వ్యాప్తి దేశంలో ముందునుంచే పాతుకుపోయి ఉన్నసామాజిక, ఆర్ధిక అసమా నతలను రెట్టింపు చేసేలా తయా రయింది. కరోనా పరీక్షలను ఎటువంటి మత, కుల, ధన, బీద అని తేడాలు లేకుండా అందరినీ ఒకేలా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆశ్చర్యము కలిగించే విషయం ఏమిటంటే కేంద్ర ప్రభుత్వం కంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే వ్యాధి-నిర్వాహణలో చాలా మెరుగ్గా వ్యవహరి స్తున్నాయి. ఎటువంటి తయారీ ముం దస్తు ప్రణాళిక లేకుం డా అకస్మాత్తుగా విధించబడిన లాక్‌డౌన్‌ వలన ఎక్కువ గా నష్టపోయింది వలస కార్మికులు, బడుగు బలహీన వర్గాల వారే. ఇక దేశంలో వ్యాధి వ్యాప్తి విషయానికి వస్తే పరీక్షల నిర్వ హణ తక్కువగా ఉండడం రోజురోజుకు వ్యాధి వ్యాప్తి చెంద డం ఆందోళన కలిగించే అంశాలు. దీనికిగాను భౌతిక దూరం పాటిం చకపోవడం, సరైన వైద్య సదుపాయాలు, పరికరాలు, పరీక్షించే యంత్రాలు సరైనసంఖ్యలో లేకపోవడమే కరోనా వ్యాధి పరీక్షలను ఒక క్రమమైన పద్ధతిలో నిర్వహించాలి. అదేవిధంగా లాక్‌ డౌన్‌ వలన ప్రజలలో భయం, అణగారిన వర్గాలపై చిన్నచూపు, వైద్యుల పై నర్సులపై దాడి, గృహహింస లాంటివి చోటు చేసుకోవడం దురదృష్టకరం. వీటిని అడ్డుకునేలా కఠినమైన చర్యలు ఇంకా అవసరం. అలాగే కరోనా వ్యాధిని ఒక మతానికో ఒక కులానికో ఒక ప్రాంతానికో పరిమితం చేస్తూ వారిని వేటాడటం, వేధించటం హింసించడం హేయమైన చర్యలు, వీటిని మానుకోవాలి. ప్రస్తుత దేశం ముందు ఉన్న సవాళ్లు: కరోనా జే.ఎన్‌1 వేరియంట్‌ వ్యాప్తి నియంత్రణలో ఉండేలా చూసు కోవడం, పరీక్షలను విస్తృతంగా చేయడం, వ్యాధి సోకిన వారిని గుర్తించడం, మిగతా వారిని ఐసోలేటెడ్‌ చేయడం, భౌతిక దూరం పాటించడం, నియమ నిబంధనలను సమర్థవం తంగా అమలు చేయడం. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విస్తృతమైన అధికారాలను బదిలీ చేయడం, ఆర్థికంగా రాష్ట్రాలను ఆదుకోవడం, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలలో వారిని ఎక్కువగా భాగస్వామ్యం చేయడం చాలా ముఖ్యమైన అంశాలు. రానున్న కాలంలో ఇలాంటి వ్యాధుల ను అరికట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభు త్వాలు వైద్యరంగ ప్రాధాన్య తను గుర్తించి దేశ స్థూల జాతీ యో త్పత్తి (జీ.డి.పి)లో ఎక్కువ శాతం నిధులను కేటాయించ డంలాం టివి చేయాలి. దీనిద్వారా ప్రాథమికంగా గ్రామస్థాయిలో, మండల స్థాయిలో, జిల్లాస్థాయిలో వైద్యరంగ వ్యవస్థను పటిష్టం చేయాలి. ఇలాంటి దీర్ఘకాలిక ప్రణాళిక చర్యలను తీసుకోవడం ఎంతో ఆవశ్యకం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు