Thursday, May 16, 2024

పార్లమెంట్‌ స్థానాలకు కోఆర్డినేటర్లు

తప్పక చదవండి
  • తెలంగాణలో 17 స్థానాలకు సమన్వయకర్తలు
  • కోఆర్డినేటర్లను ప్రకటించిన ఏఐసీసీ
  • రేవంత్‌ రెడ్డికి మహబూబ్‌ నగర్‌, చేవెళ్ల బాధ్యతలు

లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా తెలంగాణలోని 17 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఆదివారం సమన్వయకర్తలను ఏఐసీసీ నియమించింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణలో మినహా మిగితా చోట్ల సత్తా చాటలేకపోయింది. దీంతో ఈ సారి ప్రణాళికలకు మరింత పదును పెడుతోంది. ఈ క్రమంలో తెలంగాణ సహా పలు రాష్ట్రాల ఎన్నికల కమిటీలను ప్రకటించింది. మరికొన్ని నెలల్లో జరగనున్న ఈ ఎన్నికలను సీరియస్‌ గా తీసుకున్న ఏఐసీసీ దూకుడు పెంచింది. దేశంలోని పలు రాష్ట్రాలకు పార్లమెంట్‌ కోఆర్డినేటర్లను నియమించింది ఏఐసీసీ. సీనియర్‌ నేతలకు లోక్‌ సభ ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తూ వారిని ఎంపీ నియోజకవర్గాలకు కోఆర్డినేటర్లుగా నియమించింది. తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి మహబూబ్‌ నగర్‌, చేవెళ్ల బాధ్యతలు అప్పగించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి మహబూబాబాద్‌, ఖమ్మం లోక్‌ సభ స్థానాలకు కాంగ్రెస్‌ కో ఆర్డినేటర్లుగా నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఇదివరకే తెలంగాణ ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా సీఎం రేవంత్‌రెడ్డిని కాంగ్రెస్‌ అధిష్టానం నియమించింది. దేశ వ్యాప్తంగా జరగనున్న లోక్‌ సభ ఎన్నికలు మూడు నెలల్లో జరగనుండడంతో కాంగ్రెస్‌ పార్టీ వివిధ రాష్ట్రాలకు ఎన్నికల కమిటీలను నియమించింది.

తెలంగాణలో 17 లోక్‌ సభ స్థానాలకు పార్లమెంట్‌ కోఆర్డినేటర్లు..

  1. ఆదిలాబాద్‌ (ఎస్టీ) – డి. అనసూయ (సీతక్క)
  2. పెద్దపల్లి (ఎస్సీ) – డి. శ్రీధర్‌ బాబు
  3. కరీంనగర్‌ – పొన్నం ప్రభాకర్‌
  4. నిజామాబాద్‌ – టి.జీవన్‌ రెడ్డి
  5. జహీరాబాద్‌ – పి.సుదర్శన్‌ రెడ్డి
    6 మెదక్‌ – దామోదర రాజనరసింహ
  6. మల్కాజిగిరి – తుమ్మల నాగేశ్వరరావు
    8 సికింద్రాబాద్‌ – భట్టి విక్రమార్క మల్లు
  7. హైదరాబాద్‌ – భట్టి విక్రమార్క మల్లు
  8. చేవెళ్ల – రేవంత్‌ రెడ్డి
  9. మహబూబ్‌ నగర్‌ – రేవంత్‌ రెడ్డి
  10. నాగర్‌ కర్నూల్‌ (ఎస్సీ) – జూపల్లి కృష్ణారావు
  11. నల్గొండ – ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
  12. భువనగిరి – కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి
  13. వరంగల్‌ (ఎస్సీ) – కొండా సురేఖ
  14. మహబూబాబాద్‌ (ఎస్టీ) – పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
  15. ఖమ్మం – పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు