Wednesday, May 15, 2024

కూలిన చర్చి స్లాబ్‌..

తప్పక చదవండి
  • నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదం
  • శిథిలాల కింద చిక్కుకున్న మరికొందరు కూలీలు
  • సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్‌లు

సంగారెడ్డి జిల్లా కోహిర్‌ మండల కేంద్రంలోని లాలా కుంటలో నూతన మెథడిస్ట్‌ చర్చి నిర్మాణపు పనుల్లో ప్రమాదం జరింది. స్లాబ్‌ కు సపోర్టుగా ఉన్న చెక్కలకు పక్కకు జరిగి స్లాబ్‌ కూలిపోయింది. 130బై50 ఫీట్లు ఉన్న ఈ స్లాబ్‌ ను 40 ఫీట్ల ఎత్తులో వేశారు. దీంతో స్లాబ్‌ ఒక్కసారిగా కూలింది. ఈ ప్రమాదంలో 11 మంది కూలీలు గాయపడ్డారు. నలుగురు కార్మికులు చనిపోయినట్లు తెలిసింది. కార్మికులు శిథిలాల కింద చిక్కుకోగా.. విషయం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు వెంటనే అక్కడకు చేరుకున్నాయి. కూలిన స్లాబ్‌ కింద చిక్కుకున్న వారిని సహాయక బృందాలు బయటకు తీశారు. గాయపడిన వారిని వెంటనే ముందు కోహిర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అనుమానంతో రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి. చనిపోయిన కార్మికులు యూపీకి చెందిన వారుగా ప్రాథమికంగా గుర్తంచారు. ఘటన ఎలా జరిగింది? మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు